Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayyar2011805a-d332-4c81-aed3-1a78933706d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayyar2011805a-d332-4c81-aed3-1a78933706d2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సొంత గడ్డపై వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా.. ఫుల్ స్వింగ్ లో కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే 2011 వన్డే వరల్డ్ కప్ లో ఎలా అయితే ధోని కెప్టెన్సీలో అద్భుతం చేసి ఏకంగా విశ్వవిజేతగా నిలిచిందో.. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా భారత జట్టు మరోసారి ఇలా టైటిల్ విన్నర్ గా నిలవడం ఖాయం అనేది తెలుస్తుంది. అయితే భారత జట్టులో ఉన్న బ్యాటింగ్ విభాగం ఫీల్డింగ్ విభాగం ఎంత మంచి ఫామ్ లో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరో ఒకరAyyar{#}rahul;Audi;Temper;Winner;Rahul Sipligunj;Shreyas Iyer;Rohit Sharma;Netherlands;MS Dhoni;World Cupటీమిండియాలో.. అతను మంచి టెంపర్ మెంట్ ఉన్న ఆటగాడు : ద్రావిడ్టీమిండియాలో.. అతను మంచి టెంపర్ మెంట్ ఉన్న ఆటగాడు : ద్రావిడ్Ayyar{#}rahul;Audi;Temper;Winner;Rahul Sipligunj;Shreyas Iyer;Rohit Sharma;Netherlands;MS Dhoni;World CupMon, 13 Nov 2023 10:30:00 GMTప్రస్తుతం సొంత గడ్డపై వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడుతున్న టీమిండియా.. ఫుల్ స్వింగ్ లో కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే 2011 వన్డే వరల్డ్ కప్ లో ఎలా అయితే ధోని కెప్టెన్సీలో అద్భుతం చేసి ఏకంగా విశ్వవిజేతగా నిలిచిందో.. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా భారత జట్టు మరోసారి ఇలా టైటిల్ విన్నర్ గా నిలవడం ఖాయం అనేది తెలుస్తుంది. అయితే భారత జట్టులో ఉన్న బ్యాటింగ్ విభాగం ఫీల్డింగ్ విభాగం ఎంత మంచి ఫామ్ లో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఎవరో ఒకరు బాగా ఆడి జట్టును ఆదుకోవడం కాదు.. ప్రతి ఒక్కరు కూడా వారి పాత్ర జట్టులో ఏదైతే ఉందో అది నెరవేరుస్తున్నారు. ఈ క్రమంలోనే టీం సమిష్టి కృషితో టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో మొదట కాస్త తడబడినట్లు కనిపించిన స్టార్ బాట్స్మెన్స్ శ్రేయస్ అయ్యర్ ఇక ఆ తర్వాత మ్యాచ్లలో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలనే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు.


 ఈ క్రమంలోనే భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రతిభ పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గొప్ప ఆటగాడు అంటూ కొనియాడాడు. మెగా టోర్నీలో అయ్యర్ కొన్ని అద్భుతమైన నాక్స్ ఆడాడు. ఒత్తిడిలో అతడి ఆట తీరు మరింత గొప్పగా ఉంటుంది. అతడికి మంచి టెంపర్ మెంట్ ఉంది. ఇక రోహిత్ శర్మ ఆన్ ఫీల్డ్ లో మాత్రమే కాదు.. ఆఫ్ ఫీల్డ్ లో కూడా గొప్ప నాయకుడు జట్టుకు శుబారంబాలను అందిస్తూ ఉంటాడు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>