Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mccd3ac127d-7309-45cd-a362-ed619f143685-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/mccd3ac127d-7309-45cd-a362-ed619f143685-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఒక మ్యాచ్ లో జరిగిన విషయం ఏకంగా ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వరల్డ్ క్రికెట్ ను ఊపేసి వివాదంగా ఈ విషయం మారింది అని చెప్పాలి. అదేంటో కాదు టైమ్డ్ ఔట్ వివాదం. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ ద్వారా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి పెవెలియన్ చేరిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అతను రెండు నిమిషాల్లోగా మైదానంలోకి వచ్చి బంతిని ఎదుర్కోకపోవడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ అMcc{#}Cricket;Sri Lanka;World Cup;Indiaమాథ్యూస్ 'టైమ్డ్ ఔట్' పై.. MCC కీలక వ్యాఖ్యలు?మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్' పై.. MCC కీలక వ్యాఖ్యలు?Mcc{#}Cricket;Sri Lanka;World Cup;IndiaMon, 13 Nov 2023 08:30:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల ఒక మ్యాచ్ లో జరిగిన విషయం ఏకంగా ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక వరల్డ్ క్రికెట్ ను ఊపేసి వివాదంగా ఈ విషయం మారింది అని చెప్పాలి. అదేంటో కాదు టైమ్డ్ ఔట్ వివాదం. బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆల్రౌండర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ ద్వారా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి పెవెలియన్ చేరిన ఆటగాడిగా నిలిచాడు. అయితే అతను రెండు నిమిషాల్లోగా మైదానంలోకి వచ్చి బంతిని ఎదుర్కోకపోవడంతో బంగ్లా కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశాడు.


 దీంతో ఎంపైర్లు రూల్స్ ప్రకారం చివరికి అతన్ని టైం అవుట్ గా ప్రకటించారు. ఇక అతను మైదానంలోకి వచ్చి ఒక్క బంతి కూడా ఆడకుండానే మళ్లీ పెవిలియన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక ఈ విషయం కాస్త పెద్ద వివాదంగా మారిపోయింది. ఇది క్రీడా స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధంగా ఉంది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తే ఇక ఐసిసి రూల్స్ ప్రకారమే షకీబ్ తెలివిగా ఆలోచించాడు అని మరి కొంతమంది మద్దతుగా నిలిచారు. అయితే ఇక ఈ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న.. టైం అవుట్ వివాదం పై చర్చ మాత్రం అసలు ఆగడం లేదు అని చెప్పాలి.



 అయితే ఇలా ప్రపంచ క్రికెట్లో తీవ్ర దుమారం రేపిన శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం గురించి అటు క్రికెట్ మరిల్ బోన్ క్రికెట్ క్లబ్ కీలక ప్రకటన చేసింది. మరిల్ బోన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ చట్టాలను ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అంపైర్లు మాథ్యూస్  టైమ్డ్ ఔట్ గా ప్రకటించడం సరైన నిర్ణయమే అంటూ మరిl బోన్ క్రికెట్ క్లబ్ తెలిపింది. కొత్త హెల్మెట్ అడిగే ముందు అతను అంపైర్లను సంప్రదించి ఉంటే ఈ అవుట్ నుంచి తప్పించుకునే వాడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మరిల్ బోన్ క్రికెట్ క్లబ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>