Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral10255430-9971-4c07-b533-1dccae53e081-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral10255430-9971-4c07-b533-1dccae53e081-415x250-IndiaHerald.jpgఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో కొండచిలువలు కూడా ఒకటి అన్న విషయం తెలిసింది అత్యంత భారీ ఆకారంతో ఉండే ఈ కొండచిలువలు ఇక వాటికంటే భారీ ఆకారంతో ఉన్న జంతువులను సైతం వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. కేవలం మనుషులపైన కాదు అన్ని రకాల జంతువులపై కూడా దాడి చేస్తూ ఉంటాయి కొండచిలువలు. ఒక్కసారి కొండచిలువ పట్టు బిగించింది అంటే ఇక ప్రాణాలతో బయటపడటం ఏ జీవికైనా అసాధ్యం అని చెప్పాలి. అయితే పెద్ద పెద్ద జంతువుల సైతం కొండచిలువను చూస్తే భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదకరమైన జంతువులుViral{#}netizens;Instagram;Newsకొండచిలువ కడుపులో భారీ ఆకారం.. ఏంటా అని కోసి చూసీ షాక్?కొండచిలువ కడుపులో భారీ ఆకారం.. ఏంటా అని కోసి చూసీ షాక్?Viral{#}netizens;Instagram;NewsMon, 13 Nov 2023 15:30:00 GMTఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో కొండచిలువలు కూడా ఒకటి అన్న విషయం తెలిసింది అత్యంత భారీ ఆకారంతో ఉండే ఈ కొండచిలువలు ఇక వాటికంటే భారీ ఆకారంతో ఉన్న జంతువులను సైతం వేటాడి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. కేవలం మనుషులపైన కాదు అన్ని రకాల జంతువులపై కూడా దాడి చేస్తూ ఉంటాయి కొండచిలువలు. ఒక్కసారి కొండచిలువ పట్టు బిగించింది అంటే ఇక ప్రాణాలతో బయటపడటం ఏ జీవికైనా అసాధ్యం అని చెప్పాలి. అయితే పెద్ద పెద్ద జంతువుల సైతం కొండచిలువను చూస్తే భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి.


 ఈ క్రమంలోనే కొన్ని ప్రమాదకరమైన జంతువులు సైతం ఏకంగా కొండచిలువల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఒక కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఏకంగా కొండచిలువ ప్రమాదకరమైన భారీ మొసలిని మింగేసింది. అయితే ముందుగా కొండచిలువ ఒక భారీ జీవినీ మింగి ప్రాణాలు కోల్పోయింది అన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దాని పొట్ట కోసి కొండచిలువ కడుపులో ఉన్న జంతువును చూసి ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.


 ఫ్లోరిడాలోని ఎవర్ గ్లేట్స్ లోని నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది అన్నది తెలుస్తుంది. బర్మీస్ కొండచిలువలు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక పార్కులో చనిపోయి ఉన్న 18 అడుగుల కొండచిలువను.. చూసి స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. అధికారులు వచ్చి ఏదో భారీ జంతువును తినడంతో కొండచిలువ  ప్రాణాలు కోల్పోయింది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే దాని కడుపుని కోసి   చూడగా లోపల ఐదు అడుగుల ముసలి ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రమాదకరమైన మొసలిని మింగేసింది అంటే కొండచిలువ ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>