HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips34e89799-26c0-43ca-88c2-a7926a7d8fe4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tips34e89799-26c0-43ca-88c2-a7926a7d8fe4-415x250-IndiaHerald.jpgసీజన్ తో సంబంధం లేకుండా చాలా మంది కూడా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కళ్లు మండడం, గొంతునొప్పి, దగ్గు ఇంకా ముక్కు నుండి నీరు కారడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.ఇక దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది కూడా ఎక్కువగా మందులు వాడుతూ ఉంటారు. ఇలా మందులకు బదులుగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.మిమ్మల్ని గొంతునొప్పి బాగా వేధిస్తున్నప్పుడు హెర్బల్ టీని తయారు చేసి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఒక గHealth Tips{#}thulasi;Tulasi;Turmericదగ్గు, జలుబు, గొంతు సమస్యలు చిటికెలో తగ్గే టిప్స్?దగ్గు, జలుబు, గొంతు సమస్యలు చిటికెలో తగ్గే టిప్స్?Health Tips{#}thulasi;Tulasi;TurmericSun, 12 Nov 2023 17:48:00 GMTసీజన్ తో సంబంధం లేకుండా చాలా మంది కూడా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కళ్లు మండడం, గొంతునొప్పి, దగ్గు ఇంకా ముక్కు నుండి నీరు కారడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.ఇక దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది కూడా ఎక్కువగా మందులు వాడుతూ ఉంటారు. ఇలా మందులకు బదులుగా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.మిమ్మల్ని గొంతునొప్పి బాగా వేధిస్తున్నప్పుడు హెర్బల్ టీని తయారు చేసి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే అల్లం, తులసి ఆకులు, నల్ల మిరియాలు ఇంకా లవంగాలు వేసి కప్పు నీరు అయ్యే వరకు బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి తేనె కలిపి తీసుకోవాలి. ఇలా హెర్బల్ టీని తయారు చేసి తీసుకోవడం వల్ల గొంతునొప్పి సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే గొంతునొప్పిని తగ్గించడంలో మిరియాలు మనకు బాగా సహాయపడతాయి.


మీరు గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు మిరియాలను నేరుగా నోట్లో వేసి నమిలి మింగవచ్చు.అయితే ఇలా తీసుకోలేని వారు మిరియాలను పొడిగా చేసి తేనెతో కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తూ మింగాలి. ఇలా చేయడం వల్ల కూడా గొంతునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే గొంతునొప్పి, ఛాతిలో నొప్పి, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిలో ఉప్పుని వేసి కలపాలి. ఆ తరువాత ఈ నీటిని గొంతులో పోసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 నుండి 4 సార్లు చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అదే విధంగా పాలల్లో పసుపు వేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పాలల్లో పసుపుని వేసి తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ అలర్జిక్ గుణాలు ఇన్పెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>