Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle58ec0251-f069-4817-923c-3238e25ba5fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle58ec0251-f069-4817-923c-3238e25ba5fd-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో పలు తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి నటి కస్తూరి శంకర్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో కూడా నటించారు. ఇలా పలు సినిమాలలో నటించినటువంటి కస్తూరి శంకర్ అనంతరం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇలా బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తులసి పాత్రలో నటsocialstars lifestyle{#}kasthuri;Annamayya;Santosham;thulasi;Tulasi;media;Akkineni Nagarjuna;Teluguఅక్కడికి వెళ్ళేది అందుకే అని షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి ....!!అక్కడికి వెళ్ళేది అందుకే అని షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి ....!!socialstars lifestyle{#}kasthuri;Annamayya;Santosham;thulasi;Tulasi;media;Akkineni Nagarjuna;TeluguSun, 12 Nov 2023 23:23:00 GMTసినీ ఇండస్ట్రీలో పలు తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా గుర్తింపు పొందినటువంటి నటి కస్తూరి శంకర్గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో కూడా నటించారు. ఇలా పలు సినిమాలలో నటించినటువంటి కస్తూరి శంకర్ అనంతరం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ప్రస్తుతం మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు.

ఇలా బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా తులసి పాత్రలో నటిస్తూ ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి. ఇలా ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా కస్తూరి శంకర్ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె వృత్తిపరంగా లాయర్ చదువు చదివారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కస్తూరి శంకర్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈమె పబ్ కి వెళ్తానని పబ్ కి వెళ్ళే అలవాటు తనకు ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా పబ్ కి వెళ్లి ఎంతో ఎంజాయ్ చేస్తుంటాము నా ఫ్రెండ్స్ అందరూ బాగా తాగుతూ డాన్సులు చేస్తూ ఉండగా తాను మాత్రం వాటర్ మెలన్ జ్యూస్ తాగుతూ వారితో కలిసి డాన్స్ చేస్తూ ఉంటానని తెలిపారు. అయితే నేను పబ్ కి వెళ్ళేది బాగా ఎంజాయ్ చేసి రావడానికి కాదు.

 నా ఫ్రెండ్స్ అందరికీ నేనొక డ్రైవర్గా వెళ్తానని వారందరూ బాగా తాగి ఎంజాయ్ చేస్తే తాను వారందరిని సేఫ్ గా ఇంటిదగ్గర దింపడానికి మాత్రమే వెళ్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా తాను ఒకసారి పబ్ కి అక్కడ ఉన్నటువంటి కొందరు లేడి వర్కర్స్ తనని గుర్తుపట్టి మీరు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి గారు కదా అంటూ తనని గుర్తుపట్టారని అలా ఈ సీరియల్ నాకు గుర్తింపు తీసుకువచ్చిందంటూ ఈమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>