DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tv932ce0946-138f-49a9-bc25-4452d0acdb3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/tv932ce0946-138f-49a9-bc25-4452d0acdb3a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. వీరికి ఆధారాలు అవసరం లేదు. ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు ఇవ్వొచ్చు. అయితే అధికార పార్టీకి, లేదా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండాలి. న్యూట్రల్ గా ఉంటూ అవినీతి, సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తుంటే ఇరు పక్షాల వారు వ్యతిరేకిస్తుంటారు. ఏపీ విషయానికొస్తే సమస్యలు, అవినీతిపై వార్తలు రాస్తే టీడీపీకి అమ్ముడు పోయిందని ప్రచారం చేస్తుంటారు. అదే సంక్షేమ పథకాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబితే వైసీపీ కొమ్ము కాస్తున్నాTV9{#}Andhra Pradesh;television;Police Station;YCP;TV9;Scheduled caste;TDP;Government;News;media;Ishtamటీవీ9 వర్సెస్‌ టీడీపీ.. కేసుల దాకా వెళ్లిందిగా?టీవీ9 వర్సెస్‌ టీడీపీ.. కేసుల దాకా వెళ్లిందిగా?TV9{#}Andhra Pradesh;television;Police Station;YCP;TV9;Scheduled caste;TDP;Government;News;media;IshtamSun, 12 Nov 2023 07:22:06 GMTప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. వీరికి ఆధారాలు అవసరం లేదు. ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు ఇవ్వొచ్చు. అయితే అధికార పార్టీకి, లేదా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండాలి.  న్యూట్రల్ గా ఉంటూ అవినీతి, సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తుంటే ఇరు పక్షాల వారు వ్యతిరేకిస్తుంటారు.


ఏపీ విషయానికొస్తే సమస్యలు, అవినీతిపై వార్తలు రాస్తే టీడీపీకి అమ్ముడు పోయిందని ప్రచారం చేస్తుంటారు. అదే సంక్షేమ పథకాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబితే వైసీపీ కొమ్ము కాస్తున్నావని అంటుంటారు. దీనికి ఆధారాలు అవసరం లేదు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయవచ్చు. ప్రస్తుతం టీవీ 9 దేవీపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఆమె చాలా గట్టిగా ప్రతిఘటించింది. తనపై పోస్టులు పెట్టిన మహాసేన రాజేశ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఎస్సీ విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు మహాసేన రాజేశ్ పై టీవీ9 ప్రతినిధులు ఫిర్యాదు మేరకు విజయవాడలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 1న సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో 368 నంబరు ఎప్ఐఆర్ ప్రకారం 120(బీ), 153, 153-ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీవీ 9 సెక్రటరీ ఏ భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


అలాగే టీవీ 9 అసోసియేట్ ఎడిటర్ దేవీ నాగవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమపై రాజేశ్ దాడులకు పాల్పడుతున్నారని.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.  మీడియా ప్రతిష్ఠను దిగజారుస్తూ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన టీవీ9 యాజమాన్యం, దేవీ నాగవల్లి ధైర్యం చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>