Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccbd5fae8e-b236-4d78-9b74-33aab022c0d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccbd5fae8e-b236-4d78-9b74-33aab022c0d4-415x250-IndiaHerald.jpgఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగి ఉన్న ఒక జట్టు సభ్యత్వాన్ని ఇటీవల సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయం కాస్త ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు ఎంత దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనIcc{#}vedhika;Cricket;Sri Lanka;World Cup;Champion;India;politics;Government;Novemberలంక బోర్డుపై సస్పెన్షన్.. ఆ ప్రపంచకప్ వేదిక మారనుందా?లంక బోర్డుపై సస్పెన్షన్.. ఆ ప్రపంచకప్ వేదిక మారనుందా?Icc{#}vedhika;Cricket;Sri Lanka;World Cup;Champion;India;politics;Government;NovemberSat, 11 Nov 2023 09:00:00 GMTఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగి ఉన్న ఒక జట్టు సభ్యత్వాన్ని ఇటీవల సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయం కాస్త ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టు ఎంత దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఈ ఛాంపియన్ టీమ్ ఎక్కడ కనీస ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. వరుస ఓవటములతో అందరినీ నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే ఇలా శ్రీలంక టీం లో ఇంతటి మార్పులు రావడానికి శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అన్న వాదన గత కొంతకాలం నుంచి వినిపిస్తుంది. శ్రీలంక క్రికెట్ బోర్డుల్లో రాజకీయాలు పూలుముకోవడంతో ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. లంక బోర్డును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.


 అయితే ఈ నిర్ణయం ద్వారా ఒక ఐసీసీ టోర్నీ వేదిక మారబోతుందా అనే చర్చ ప్రస్తుతం తెరమిదికి వచ్చింది. శ్రీలంక సభ్యత్వాన్ని ఐసీసీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో.. 2024 లో జరగాల్సిన ఐసీసీ అండర్ 19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహణపై నీలి నీడలకు అమ్ముకున్నాయి అని చెప్పాలి. ఈ వరల్డ్ కప్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామంతో ఇక అండర్ 19 ప్రపంచకప్ నిర్వహణపై ఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా నవంబర్ 21న ఐసిసి బోర్డు సమావేశం ఉంది. ఇక ఈ సమావేశంలో ఈ అండర్ 19 వరల్డ్ కప్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>