DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modid61415ae-4f9d-45eb-8a1a-17ed46a862cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/modid61415ae-4f9d-45eb-8a1a-17ed46a862cb-415x250-IndiaHerald.jpgఇజ్రాయెల్ కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఆ దేశంపై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ విషయమై ఆమోదించాల్సి ఉంటుంది. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేసిన వెంటనే పాలస్తీనాకు చెందిన సుమారు 90 వేల మంది కారMODI{#}Narendra Modi;vegetable market;Smart phone;war;Prime Minister;Israel;October;Indiaఇజ్రాయెల్ యుద్ధం: భారత్‌కు కొత్త అవకాశం?ఇజ్రాయెల్ యుద్ధం: భారత్‌కు కొత్త అవకాశం?MODI{#}Narendra Modi;vegetable market;Smart phone;war;Prime Minister;Israel;October;IndiaSat, 11 Nov 2023 10:00:00 GMTఇజ్రాయెల్ కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఆ దేశంపై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ ఇండియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ విషయమై ఆమోదించాల్సి ఉంటుంది.


అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడులు చేసిన వెంటనే పాలస్తీనాకు చెందిన సుమారు 90 వేల మంది కార్మికుల వర్క్ పర్మిట్ లను ఆ దేశం రద్దు చేసింది.  దీంతో పాలస్తీనా కార్మికులంతా తమ దేశానికి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో ఇజ్రాయెల్ లో తీవ్రంగా మానవ వనరుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న భారత్ తో మానవ వనరులను రిక్రూట్ చేసుకోవాలని ఇజ్రాయెల్ సర్కారు యోచిస్తోంది.


ఇజ్రాయెల్ లో లేబర్ మార్కెట్ ప్రస్తుతం భారతీయ కార్మికులకు అనుకూలంగా ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకిస్తూ ఇటీవల అరబ్ దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఈ నిర్ణయంతో భారత్ ఇజ్రాయెల్ కు చేరువైంది. దీంతో పాటు నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ లో పర్యటించడం.. కూడా భారత్ కు సానుకూలాంశం.


కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఇజ్రాయెల్  కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్ లో ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను భారతీయులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ నెతన్యాహూ కి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఉగ్ర వాదంపై పోరులో భారత్ మీకు ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని స్పష్టం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>