Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc559785b9-b845-490f-a34d-51ff7b4ff695-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc559785b9-b845-490f-a34d-51ff7b4ff695-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కీలకమైన దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో సెమీ ఫైనల్ ప్రారంభం కాబోతుంది. దాదాపు లీగ్ మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ కు ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే ఇక ఇప్పటికే సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న కొంతమంది ఆటగాళ్లకు ఇక ఇదే చివరి వన్ డే వరల్డ్ కప్ కావచ్చు. 2027 వన్డే ప్రపంచ కప్ లో కొంతమంది ఆటగాళ్ళను చూడలేము అన్న విషయం అభిమానులకు కూడా దాదాపుగా అర్థమవుతుంది అని చెప్పాలి. మరి ఇలా వచ్చIcc{#}VIRAT KOHLI;Rohit Sharma;Athadu;Australia;Cricket;World Cup;New Zealand;India;Newsవచ్చే ప్రపంచకప్ లో.. ఈ నలుగురు ప్లేయర్స్ ని చూడడం కష్టమేనా?వచ్చే ప్రపంచకప్ లో.. ఈ నలుగురు ప్లేయర్స్ ని చూడడం కష్టమేనా?Icc{#}VIRAT KOHLI;Rohit Sharma;Athadu;Australia;Cricket;World Cup;New Zealand;India;NewsSat, 11 Nov 2023 18:00:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కీలకమైన దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో సెమీ ఫైనల్ ప్రారంభం కాబోతుంది. దాదాపు లీగ్ మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ కు ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎందుకంటే ఇక ఇప్పటికే సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న కొంతమంది ఆటగాళ్లకు ఇక ఇదే చివరి వన్ డే వరల్డ్ కప్ కావచ్చు. 2027 వన్డే ప్రపంచ కప్ లో కొంతమంది ఆటగాళ్ళను చూడలేము అన్న విషయం అభిమానులకు కూడా దాదాపుగా అర్థమవుతుంది అని చెప్పాలి. మరి ఇలా వచ్చే వరల్డ్ కప్ నాటికి రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉన్న క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం..


 రోహిత్ శర్మ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత 36 ఏళ్ల వయసుతో ఉన్నాడు. అయితే 2027 వరల్డ్ కప్ నాటికి అతనికి 41 సంవత్సరాలు వస్తాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ కప్ లో ఆడటం చాలా కష్టం. అందుకే ప్రస్తుతం తన కెప్టెన్సీలో భారత జట్టు టైటిల్ అందించి చిరస్మరణీయమైన వీడ్కోలను పలకాలని  అనుకుంటున్నాడు రోహిత్ శర్మ.


 విరాట్ కోహ్లీ  : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వయసు 35 ఏళ్లు. ఇక 2027 ఓడిఐ వరల్డ్ కప్ నాటికి అతనికి 39 ఏళ్ళు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతని ఫిట్నెస్ సహకరిస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. దీంతో అతను దాదాపు వరల్డ్ కప్ ఆడటం కష్టమే అన్నది తెలుస్తుంది.


 కేన్ విలియంసన్ : న్యూజిలాండ్ కెప్టన్ గా కొనసాగుతున్న కేన్ విలియమ్సన్ తన ఆటతీరుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఇక జట్టును ఎంతో విజయవతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతని వయస్సు 34 ఏళ్ళు ఇక అతడు ఫిట్నెస్ ను పరిగణలోకి తీసుకుంటే.. అతనికి ఇదే చివరి వన్డే ప్రపంచ కప్ అయ్యే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకులు అంచనా.



 డేవిడ్ వార్నర్ : ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ గా కొనసాగుతున్న వార్నర్ ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అయితే ఇప్పటికే వార్నర్ రిటైర్మెంట్ పై కొంతకాలం నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత వార్నర్ మూడు ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది. ఇలా తమ ఆటతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న ఈ నలుగురు క్రికెటర్లు వచ్చే వన్డే ప్రపంచకప్ లో చూడటం కష్టమే. అయితే ఇది తప్పదు అని తెలిసినా ఇక ఈ విషయాన్ని మాత్రం అటు అభిమానులు చేయించుకోలేకపోతున్నారూ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>