MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-chandramohna-nomorebb49d437-9939-4624-a974-e1294c81d096-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-chandramohna-nomorebb49d437-9939-4624-a974-e1294c81d096-415x250-IndiaHerald.jpgగత కొన్నేళ్లుగా సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తీవ్రమైన విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజున సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఉదయం 9:45 నిమిషాలకు హృద్రోగంతో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈయన వయసు 82 సంవత్సరాలు ఈయన భార్య పేరు జలంధర వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రోజున హైదరాబాదులో చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యACTER CHANDRAMOHNA;NOMORE{#}jayasudha;suhasini;Thota Chandrasekhar;Wife;monday;Success;Cinema;Telugu;bhavanaసీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!!సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!!ACTER CHANDRAMOHNA;NOMORE{#}jayasudha;suhasini;Thota Chandrasekhar;Wife;monday;Success;Cinema;Telugu;bhavanaSat, 11 Nov 2023 10:42:00 GMTగత కొన్నేళ్లుగా సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తీవ్రమైన విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజున సీనియర్ నటుడు చంద్రమోహన్ తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఉదయం 9:45 నిమిషాలకు హృద్రోగంతో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈయన వయసు 82 సంవత్సరాలు ఈయన భార్య పేరు జలంధర వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం రోజున హైదరాబాదులో చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.


హీరోగా నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో ఒక వెలుగు వెలుగును చంద్రమోహన్ ఎంతోమంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే ఖచ్చితంగా వారికి తిరుగు ఉండదని భావన చాలామంది హీరోయిన్లలో ఉన్నది అలా జయసుధ జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ ఆయనతో మొదట నటించిన వారే. 1942 మే 23న కృష్ణాజిల్లాలో జన్మించడం జరిగింది చంద్రమోహన్ ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ కానీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చంద్రశేఖర్ గా మార్చుకోవడం జరిగింది.

దాదాపుగా 932 కు పైగా సినిమాలలో నటించిన చంద్రమోహన్ 1966 లో రంగుల రత్నం అనే సినిమా ద్వారా మొదటిసారి తన సినీ కెరీయర్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఎన్నో చిత్రాలలో విలక్షణమైన పాత్రలో నటించి చెరగని ముద్ర వేసుకున్న చంద్రమోహన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించారు. అందులో కూడా తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్న చంద్రమోహన్ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలకు మంచి సక్సెస్ అందుకున్నారు. దాదాపుగా చంద్రమోహన్ టాప్ హీరోయిన్లతో కూడా నటించారు. సహజ నటనతో మెప్పించిన చంద్రమోహన్ అనారోగ్య కారణాల చేత కొద్ది రోజుల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.. కానీ ఇటీవలే తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోతున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>