DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/posani672442bc-5fd3-4ff3-8036-1892e174a7e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/posani672442bc-5fd3-4ff3-8036-1892e174a7e0-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రాజకీయ పరంగా విభేదించాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు.. కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు రాజకీయాలకు మంచి పరిణామాలు కాదు. ఇవి అనేందుకు.. వినేందుకు బాగానే ఉంటాయి. కానీ మళ్లీ ఆ మాటలు తన వరకు వస్తే కానీ తెలియదు. ఏపీ ఫిలిం, టీవీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళీ ఏది మాట్లాడినా సంచలనమే. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు ఆ విధంగా ఉంటాయి. తాజాగా ఆయన ఓ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. అదేంటంటే మా ఇంట్లో పెళ్లి చేద్దాం అంటే మా (కPOSANI{#}krishna;television;Andhra Pradesh;advertisement;marriageపోసాని ఇంట్లో పెళ్లి సమస్య.. కొత్త చర్చ?పోసాని ఇంట్లో పెళ్లి సమస్య.. కొత్త చర్చ?POSANI{#}krishna;television;Andhra Pradesh;advertisement;marriageSat, 11 Nov 2023 09:00:00 GMTరాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రాజకీయ పరంగా విభేదించాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు.. కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు రాజకీయాలకు మంచి పరిణామాలు కాదు. ఇవి అనేందుకు.. వినేందుకు బాగానే ఉంటాయి. కానీ మళ్లీ ఆ మాటలు తన వరకు వస్తే కానీ తెలియదు. ఏపీ ఫిలిం, టీవీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళీ ఏది మాట్లాడినా సంచలనమే. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు ఆ విధంగా ఉంటాయి. తాజాగా ఆయన ఓ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు.


అదేంటంటే మా ఇంట్లో పెళ్లి చేద్దాం అంటే మా (కమ్మ సామాజిక వర్గం) వాళ్లు అమ్మాయిని ఎవరూ ఇవ్వనంటున్నారు అని. ఇప్పుడు ఈ విషయంలోకి పిల్లల్ని ఎందుకు తీసుకురావాలి. ఆయన ఒకటి రెండు సంబంధాలు చూసుంటారు. అవి నచ్చకపోయే సరికి పై విధంగా  మాట్లాడటం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని, అబ్బయ చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్ లాంటి నాయకుల ఇంట్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. వైసీపీలో ఉన్నాను కాబట్టే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పడం అవివేకం అవుతుంది. ఇలాంటి సున్నిత మైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి.


సాధారణంగా సినీ కుటుంబాల నేపథ్యం ఉన్నవారికి అమ్మాయిలను ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరన్న వాదన ఉంది. ఎందుకంటే వృత్తి పరంగా ఏవైనా ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. అదే అగ్ర హీరోలు అయితే ఈ సమస్య ఉండదు. ఎందుకంటే ఆస్టార్ ఇమేజ్ వాళ్లకి కూడా వస్తోంది కాబట్టి. సమాజంలో వాళ్లకి కూడా గుర్తింపు వస్తుంది అని ఆశించి అమ్మాయిలను ఇవ్వడానికి ముందుకు వస్తుంటారు. మిగతా వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీని గురించి వాళ్ల కుటుంబాల్లో అంతర్గతంగా చర్చించాలి కానీ బహిరంగ ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఇంకో నలుగురికి తెలుస్తుంది తప్ప ఉపయోగం ఉండదు అని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>