DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/israelf83df0ca-2dd5-48a6-88e9-035192043fef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/israelf83df0ca-2dd5-48a6-88e9-035192043fef-415x250-IndiaHerald.jpgమన చిన్నప్పుడు పాఠశాలలో టీచర్ నువ్వు ఏం అవుతావు అంటే డాక్టర్, ఇంజినీరు, ఐఏస్, ఐపీఎస్, సాఫ్ట్ వేర్, పోలీస్ ఇలా వరుసగా అన్నీ పేర్లు చెబుతుంటారు. కానీ సైనికుడు అయి దేశానికి సేవ చేస్తానని మాత్రం ఎవరూ చెప్పరు. సైన్యం లోకి వెళ్దాం అనుకునే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సైన్యం లోకి వెళ్దామని అనుకున్నా.. ఆయా ప్రాంతాల సైనిక అధికారులు రిక్రూట్ మెంట్ లో తమ వాళ్లనే తీసుకొంటుంటారు. ఫలితంగా కొంతమందికి మొండిచేయి ఎదురవుతోంది. ప్రస్తుతం సైనికులను అగ్నిపథ్ ద్వారా ఎంపిక చేసుకుంటున్నాం. ఈ విషయంisrael{#}Russia;Ukraine;American Samoa;Army;Traffic police;Fighter;Service;Israelకిరాయి సైన్యంతో ఇజ్రాయెల్‌ అరాచకాలు?కిరాయి సైన్యంతో ఇజ్రాయెల్‌ అరాచకాలు?israel{#}Russia;Ukraine;American Samoa;Army;Traffic police;Fighter;Service;IsraelSat, 11 Nov 2023 07:00:00 GMTమన చిన్నప్పుడు పాఠశాలలో టీచర్ నువ్వు ఏం అవుతావు అంటే డాక్టర్, ఇంజినీరు, ఐఏస్, ఐపీఎస్, సాఫ్ట్ వేర్, పోలీస్ ఇలా వరుసగా అన్నీ పేర్లు చెబుతుంటారు. కానీ సైనికుడు అయి దేశానికి సేవ చేస్తానని మాత్రం ఎవరూ చెప్పరు. సైన్యం లోకి వెళ్దాం అనుకునే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సైన్యం లోకి వెళ్దామని అనుకున్నా.. ఆయా ప్రాంతాల సైనిక అధికారులు రిక్రూట్ మెంట్ లో తమ వాళ్లనే తీసుకొంటుంటారు. ఫలితంగా కొంతమందికి మొండిచేయి ఎదురవుతోంది.


ప్రస్తుతం సైనికులను అగ్నిపథ్ ద్వారా ఎంపిక చేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాదులను మట్టు బెట్టేందుకు గాజాపై భీకర దాడులు చేస్తోంది. అయితే నెతన్యాహూ పదేళ్ల కాలంలో పదవి నుంచి దిగిపోయిన తర్వాత వచ్చిన ఇజ్రాయెల్ అధ్యక్షులు సైనిక రిక్రూట్ మెంట్ పై దృష్టి సారించలేదు. నెతన్యాహూ దేశ భద్రతకే ప్రాధాన్యం ఇస్తూ సైనిక నియామకాలు చేపట్టేవారు. ప్రస్తుతం సైనికుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇజ్రాయెల్ కిరాయి సైన్యాన్ని ఆశ్రయిస్తోందన్న ఆరోపణలున్నాయి.


రష్యా ఎలా అయితే వాగ్నార్, చచన్ సైన్యాలను పెంచి పోషిస్తోందో..అలాగే ఇజ్రాయెల్ కూడా సరికొత్త సైన్యాన్ని వాడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక స్పానిష్ ఫైటర్ ఇటీవల దొరికారు. వీళ్లను మెర్సినరీస్ అంటారు. యుద్ధంలో వాడే అన్ని రకాల ఆయుధాలను వీళ్లు ఉపయోగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నరహంతకులు అని చెప్పవచ్చు.


తాజాగా అలాంటి ఓ వ్యక్తి ఓ వీడియోని విడుదల చేశారు. మేం ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నామని అందులో పేర్కొన్నారు.  వీళ్లు గతంలో ఉక్రెయిన్ కు మద్దతుగా పనిచేశారు. వీళ్లను అమెరికా పెంచి పోషిస్తోంది. అంటే అమెరికా మెర్సినరీస్ ను ఇజ్రాయెల్ కు మద్దతుగా పంపించిందని పలువురు పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్ వద్ద కూడా ప్రైవేట్ సైన్యం ఉందనే విషయం దీని ద్వారా అవగతమవుతోంది. వీళ్లు క్రూరత్వంగా ఎవర్ని అయినా చంపేస్తుంటారు. ఇలాంటి వాళ్లు ప్రస్తుతం ఇజ్రాయెల్ తరఫున పనిచేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>