Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwinbf3e198e-c414-41a8-97e5-a1484615ab48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ashwinbf3e198e-c414-41a8-97e5-a1484615ab48-415x250-IndiaHerald.jpgఇటీవల వరల్డ్ క్రికెట్లో వివాదంగా మారిపోయి హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒకటి ఉంది. అదే టైమ్డ్ ఔట్ వివాదం. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. ఈ వివాదం తెరమీదకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. శ్రీలంక జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో ఆల్ రౌండర్ మాథ్యూస్ ఇక తన బ్యాటింగ్ తో జట్టును ఆదుకోవాలని వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఆశలతో ఆ మైదానంలో బరిలోకి దిగాడు. ఇలాంటి సమయంలో ఇక అతను బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండగా.. అతని హెల్మెట్ పట్టి తెగిపోయింది. Ashwin{#}Bangladesh;Sri Lanka;World Cupటైమ్డ్ ఔట్ వివాదంపై.. మన్ కడింగ్ మాస్టర్ అశ్విన్ ఏమన్నాడో తెలుసా?టైమ్డ్ ఔట్ వివాదంపై.. మన్ కడింగ్ మాస్టర్ అశ్విన్ ఏమన్నాడో తెలుసా?Ashwin{#}Bangladesh;Sri Lanka;World CupFri, 10 Nov 2023 15:24:00 GMTఇటీవల వరల్డ్ క్రికెట్లో వివాదంగా మారిపోయి హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒకటి ఉంది. అదే టైమ్డ్ ఔట్ వివాదం. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. ఈ వివాదం తెరమీదకి   వచ్చింది అన్న విషయం తెలిసిందే. శ్రీలంక జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో ఆల్ రౌండర్ మాథ్యూస్ ఇక తన బ్యాటింగ్ తో జట్టును ఆదుకోవాలని వచ్చాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఆశలతో ఆ మైదానంలో బరిలోకి దిగాడు. ఇలాంటి సమయంలో ఇక అతను బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండగా.. అతని హెల్మెట్ పట్టి తెగిపోయింది.


 దీంతో చేసేదేమీ లేక బంతిని ఎదుర్కోవడం ఆపేసి.. మళ్ళీ కొత్త హెల్మెట్ ను తీసుకోవడానికి వెళ్ళాడు. అయితే ఇదే అదునుగా భావించిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ ఏకంగా అతను రెండు నిమిషాలకంటే ఎక్కువ సమయం వృధా చేశాడని టైమ్డ్ ఔట్ గా ప్రకటించాలంటూ అప్పీల్ చేయడం ఇక ఎంపైర్లు  అతన్ని అవుట్ గా ప్రకటించి పెవిలియన్  పంపించడం జరిగిపోయింది. అయితే మాథ్యూస్  వేడుకున్న షకీబ్ మాత్రం అసలు కాంప్రమైజ్ కాలేదు. ఇక ఇది ఒక పెద్ద వివాదంగా మారిపోయింది. షకీబ్ ఐసీసీ రూల్స్ ప్రకారం తెలివిగా ప్రవర్తించాడని కొంతమంది అంటుంటే.. అతను క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని కొంతమంది విమర్శలు చేశారు.



 ఇదే విషయం గురించి గతంలో మన్ కడింగ్ చేసి వివాదంలో ఇరుక్కున్న భారత స్పిన్నర్ అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు వైపులా న్యాయం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు అశ్విన్. హెల్మెట్ సమస్య ఉండడంతో సమయాన్ని తీసుకోవడం మాథ్యూస్  కోణంలో సరైనదే. ఇక బ్యాటింగ్కు వచ్చేందుకి ఆలస్యం కావడంతో   షకీబ్ అప్పీల్ చేయడం కూడా అటు రూల్స్ ప్రకారమే జరిగింది. దీంతో అది కూడా కరెక్టే. కానీ ఇందులో బాగా ప్రభావితం అయింది మాత్రం శ్రీలంక ఆల్ రౌండర్ మాథ్యూస్ అంటూ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>