DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/brazil3ebe061f-8c6a-4f72-a331-4423504f85b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/brazil3ebe061f-8c6a-4f72-a331-4423504f85b0-415x250-IndiaHerald.jpgస్వీట్లు అంటే అందరికీ ఇష్టమే. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఏదైనా స్వీటు షాపు కనిపిస్తే తినకుండా ఉండలేం. బంధువులు మన ఇళ్లకు వచ్చినప్పుడు కానీ.. ఏదైనా పుట్టినరోజు వేడుకలప్పుడు, పరీక్షలో విజయం సాధించినప్పుడో.. పరీక్షా ఫలితాల సమయంలో సహజంగా మనం స్వీట్లు పంచుకుంటూ మన ఆనందాన్ని వ్యక్త పరుస్తుంటాం. అయితే భవిష్యత్తులో స్వీట్ల షాపుల సంఖ్య తగ్గే ప్రమాద ముంది. ఎందుకంటే గతంలో స్వీట్ల షాపులకు మంచి గిరాకీ ఉండేది. కొత్తరకం స్వీట్లు తయారు చేస్తే మంచి డిమాండ్ ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మందికి అనారోగBRAZIL{#}Brazil;Petrol;Sugar;Industries;Manam;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;INTERNATIONAL;Indiaభారత్‌కు ఆ టెక్నాలజీ అందివ్వనున్న బ్రెజిల్‌?భారత్‌కు ఆ టెక్నాలజీ అందివ్వనున్న బ్రెజిల్‌?BRAZIL{#}Brazil;Petrol;Sugar;Industries;Manam;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;INTERNATIONAL;IndiaFri, 10 Nov 2023 00:00:00 GMTస్వీట్లు అంటే అందరికీ ఇష్టమే. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఏదైనా స్వీటు షాపు కనిపిస్తే తినకుండా ఉండలేం. బంధువులు మన ఇళ్లకు వచ్చినప్పుడు కానీ.. ఏదైనా పుట్టినరోజు వేడుకలప్పుడు, పరీక్షలో విజయం సాధించినప్పుడో.. పరీక్షా ఫలితాల సమయంలో సహజంగా మనం స్వీట్లు పంచుకుంటూ మన ఆనందాన్ని వ్యక్త పరుస్తుంటాం.


అయితే భవిష్యత్తులో స్వీట్ల  షాపుల సంఖ్య తగ్గే ప్రమాద ముంది. ఎందుకంటే గతంలో స్వీట్ల షాపులకు మంచి గిరాకీ ఉండేది. కొత్తరకం స్వీట్లు తయారు చేస్తే మంచి డిమాండ్ ఉండేది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మందికి అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. షుగర్ వంటి వ్యాధులతో సతమతం అవుతున్నారు. దీనికి కారణం స్వీట్లే అని భావించి చాలా మంది తినడం మానేశారు. దీంతో ప్రస్తుతం స్వీట్ల షాపులకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది.


దీనివల్ల చక్కెర పరిశ్రమ దెబ్బతింటోంది. షుగర్ ని చెరకు నుంచి తయారు చేస్తారు. చెరకు పండించేది రైతు. దీంతో ఇటు రైతు.. దానిపై ఆధారపడి జీవించే వారు ఉపాధి కోల్పోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పంచదారను వేరే విధంగా వినియోగించడానికి బ్రెజిల్ దగ్గర టెక్నాలజీ తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది.  చక్కెర నుంచి ఇథనాల్ ను తయారు చేసే టెక్నాలజీ భారత్ కు ఇవ్వడానికి బ్రెజిల్ అంగీకరించింది. పంచదార ఉత్పత్తల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది.


అంతర్జాతీయ మార్కెట్ లో ఈ రెండు దేశాలు పోటీ పడటం వల్ల ఏదేశానికి గిట్టుబాటు ధర రావడం లేదు. భారత్ లో అధికంగా ఉన్న షుగర్ ను ఇథనాల్ గా మార్చితే రెండు దేశాలకు మంచి ధర లభించే అవకాశం ఉందని బ్రెజిల్ భావిస్తోంది. పెట్రోల్ లో ఇథనాల్ ను 10 నుంచి 20శాతానికి పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇది భారత్ కు సానుకూలాంశం. ఈ ప్రక్రియ 2025నాటికి పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>