MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/japan--karthi2513a7f7-6867-4730-91d7-553f85b8de87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/japan--karthi2513a7f7-6867-4730-91d7-553f85b8de87-415x250-IndiaHerald.jpg“సర్దార్, పోన్నియన్ సెల్వన్” లాంటి సూపర్ హిట్స్ అనంతరం కార్తీ హీరోగా నటించిన 25వ చిత్రం “జపాన్”. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పట్లానే అనువాదరూపంలో తెలుగులో కూడా విడుదలైంది.కార్తీ డిఫరెంట్ స్టైల్ & బాడీ లాంగ్వేజ్ తో కనబడిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సినిమా కథ విషయానికి వస్తే హైద్రాబాద్ లోని రాయల్ జ్యూయలెర్స్ లో 200 కోట్ల దోపిడీ జరుగుతుంది. ఈ దంగతనం చేసింది జపాన్ (కార్తీ) అని తెలుసుకొని అతడ్ని పట్టుకోవడానికి తెలJapan - Karthi{#}Raccha;Traffic police;sunil;Kerala;raja;Manam;Arrest;Athadu;Comedy;Japan;sridhar;Chitram;Audience;Heroine;Cinemaజపాన్ రివ్యూ: కార్తీ కుమ్మేసాడు.. కానీ..?జపాన్ రివ్యూ: కార్తీ కుమ్మేసాడు.. కానీ..?Japan - Karthi{#}Raccha;Traffic police;sunil;Kerala;raja;Manam;Arrest;Athadu;Comedy;Japan;sridhar;Chitram;Audience;Heroine;CinemaFri, 10 Nov 2023 15:49:00 GMT“సర్దార్, పోన్నియన్ సెల్వన్” లాంటి సూపర్ హిట్స్ అనంతరం కార్తీ హీరోగా నటించిన 25వ చిత్రం “జపాన్”. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పట్లానే అనువాదరూపంలో తెలుగులో కూడా విడుదలైంది.కార్తీ డిఫరెంట్ స్టైల్ & బాడీ లాంగ్వేజ్ తో కనబడిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సినిమా కథ విషయానికి వస్తే హైద్రాబాద్ లోని రాయల్ జ్యూయలెర్స్ లో 200 కోట్ల దోపిడీ జరుగుతుంది. ఈ దంగతనం చేసింది జపాన్ (కార్తీ) అని తెలుసుకొని అతడ్ని పట్టుకోవడానికి తెలంగాణా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోకి దిగుతుంది. కట్ చేస్తే..ఇక తనకు హై.ఐ.వి పాజిటివ్ అని తెలుసుకొన్న జపాన్, తన ప్రేయసి సంజు (అను ఇమ్మాన్యూల్)ని కలవడానికి కేరళ వెళతాడు. ఈ క్రమంలో శ్రీధర్ (సునీల్) జపాన్ ను కలిసి అతడ్ని అరెస్ట్ చేయడానికి జరుగుతున్న రచ్చ గురించి వివరిస్తాడు.అయితే.. తాను ఆ దొంగతనం చేయలేదని బిగ్ షాక్ ఇస్తాడు జపాన్. ఇక అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు? జపాన్ ని ఎందుకు ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు? జపాన్ ఈ గోల నుంచి ఎలా తప్పించుకున్నాడు?  “జపాన్” స్టోరీ.


మొత్తానికి ఒక సరికొత్త కార్తీని ఈ సినిమాలో చూస్తాం. హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా అన్నిట్లో కొత్తదనం ప్రయత్నించాడు కార్తీ. ముఖ్యంగా ఆయన యాస భలే వింతగా ఉంది. ఇక నటుడిగా ఆయన స్థాయికి తగ్గ పాత్ర కాకపోయినా.. చక్కగా ఒదిగిపోయాడు కార్తీ. ముఖ్యంగా కామెడీ టైమింగ్ & యాక్షన్ సీక్వెన్స్ లలో తన సత్తా చాటుకుని.. ఆడియన్స్ ను బాగా అలరించాడు.మన సునీల్ కి మంచి పాత్ర లభించింది. ఆయన పాత్రలో సీరియస్నెస్ & కామెడీ రెండూ పుష్కలంగా ఉన్నాయి. అతడు కమెడియన్ గా కాకుండా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న విధానం నిజంగా ప్రశంసనీయం. హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ పాత్రకు పెద్ద ప్రాముఖ్యత లేదు. కాకపోతే.. అందాల ప్రదర్శనతో మాత్రం బాగానే ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులందరూ కూడా పాత్రలకు న్యాయం చేశారు.


దర్శకుడు రాజా మురుగన్  రాసుకున్న కథ ఫిలాసాఫికల్ గా భలే ఉంది. అయితే.. ఆ కథను నడిపించిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సినిమాలో  తెరకెక్కించిన కామెడీ సీన్స్ మరీ అంతగా ఆకట్టుకోలేదు.మొత్తానికి దర్శకుడిగా ఆకట్టుకోలేకపోయినా, కథకుడిగా మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ అస్సలు బాగోలేదు. మరి అతడికి అవకాశాలు ఎలా వస్తున్నాయో అర్ధం కావట్లేదు. వరుస సినిమాలు చేస్తూ ఉండటం వల్ల మ్యూజిక్ పై శ్రద్ధ పెట్టలేకపోతున్నాడేమో. మొత్తానికి సినిమా బాగుంది. కార్తీ యాక్టింగ్ కోసం చూడొచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>