Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-6a386f73-2076-4b02-af9c-43000801ad66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-6a386f73-2076-4b02-af9c-43000801ad66-415x250-IndiaHerald.jpgఅనుమానం పెనుభూతం అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎలాంటి బంధంలో అయినా సరే ఏదైనా విషయంలో అనుమానం వచ్చింది అంటే చాలు ఆ విషయంపై చర్చ జరిపి అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం చాలా బెటర్. లేదంటే ఇక అనుమానం పెరిగి పెద్దదై చివరికి బంధాన్ని నాశనం చేసే వరకు వెళుతుంది. మరి ముఖ్యంగా వైవాహిక బంధంలో అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే చాలు ఇక ఎలాంటి దారుణ పరిస్థితిలో చోటు చేసుకుంటాయి అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది ఏకంగా కట్టుకున్న వారిపై అనుమానం పెంచుకొని దారుణంగా చివరికి ప్రాణాలుMurder {#}Smart phone;Murder.;police;Husband;Wife;marriageభార్యపై అనుమానం.. చివరికి కానిస్టేబుల్ ఏం చేశాడో తెలుసా?భార్యపై అనుమానం.. చివరికి కానిస్టేబుల్ ఏం చేశాడో తెలుసా?Murder {#}Smart phone;Murder.;police;Husband;Wife;marriageFri, 10 Nov 2023 11:00:00 GMTఅనుమానం పెనుభూతం అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎలాంటి బంధంలో అయినా సరే ఏదైనా విషయంలో అనుమానం వచ్చింది అంటే చాలు ఆ విషయంపై చర్చ జరిపి అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం చాలా బెటర్. లేదంటే ఇక అనుమానం పెరిగి పెద్దదై చివరికి బంధాన్ని నాశనం చేసే వరకు వెళుతుంది. మరి ముఖ్యంగా వైవాహిక బంధంలో అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే చాలు ఇక ఎలాంటి దారుణ పరిస్థితిలో చోటు చేసుకుంటాయి అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఎంతోమంది ఏకంగా కట్టుకున్న వారిపై అనుమానం పెంచుకొని దారుణంగా చివరికి ప్రాణాలు తీసిన ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కర్ణాటకలోని చామరాజనగర్ లో ఏకంగా అనుమానంతో భర్త భార్యను హత్య చేశాడు. 32 ఏళ్ళ కిషోర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 24 ఏళ్ళ ప్రతిభను  2022 నవంబర్లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొన్నాళ్ల వరకు కిషోర్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతనికి భార్యపై అనుమానం పెరిగింది. తరచూ ప్రతిభ ఫోన్ లో వచ్చే మెసేజ్లను పరిశీలిస్తూ ఉండేవాడు. ఆమె మాట్లాడే వ్యక్తుల గురించి ఆరాధిస్తూ ఉండేవాడు.


 ఇలా ప్రతిభ విషయంలో ప్రతి విషయాన్ని కూడా అనుమానంగానే చూడటం కిషోర్ కి అలవాటైపోయింది. అయితే పది రోజుల కిందటే ప్రతిభ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సమయంలో బిడ్డ పుట్టిన ఆనందాన్ని ఆస్వాదించాల్సిన కిషోర్ భార్యకు ఫోన్ చేసి తిట్టాడు. అయితే ఆ తర్వాత 150 సార్లు ఫోన్ చేసిన ప్రతిభ ఫోన్ ఎత్తలేదు. దీంతో కోపంతో అత్తారింటికి ముందే పురుగుల మందు తాగి వెళ్లిన కిషోర్ తలుపు తట్టి..  భార్య గదిలోకి వెళ్లి చీరతో  గొంతు నొక్కి హత్య చేశాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>