Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwylode532c15b-f89f-41e5-a982-68edeab835b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwylode532c15b-f89f-41e5-a982-68edeab835b6-415x250-IndiaHerald.jpgయాక్టర్ నవదీప్ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే పరిమితం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా మారిపోయాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు వెబ్ సిరీస్ లో కూడా వైవిద్యమైన పాత్రలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఎంతోమంది స్టార్ హీరTollwylod{#}navdeep;marriage;Audience;Tollywood;Teluguనేను ఇప్పుడు దానికి రెడీగా లేను.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?నేను ఇప్పుడు దానికి రెడీగా లేను.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Tollwylod{#}navdeep;marriage;Audience;Tollywood;TeluguFri, 10 Nov 2023 10:15:00 GMTయాక్టర్ నవదీప్ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే పరిమితం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా మారిపోయాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు వెబ్ సిరీస్ లో కూడా వైవిద్యమైన పాత్రలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.


 ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ఒక కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలతో పోల్చి చూస్తే నవదీప్ వయసులో పెద్దవాడే. దాదాపు 40 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. కానీ ఇంకా ఎలిజబుల్ బ్యాచిలర్ గానే ఉంటున్నాడు ఈ యాక్టర్. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ ఇప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలను కంటుంటే.. నవదీప్ మాత్రం పెళ్లి అనే ఆలోచన చేయట్లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి రిలేషన్ షిప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 జరగాల్సిన టైం లో పెళ్లి అదే జరుగుతుంది. నేను ప్రస్తుతానికి పెళ్లి కోసం రెడీగా లేను. నేను రెడీ అయినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. చేసుకోబోయే అమ్మాయిలకు క్వాలిటీస్ గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఎందుకంటే నేను రెడీగా లేను కదా. నా లోపల ఉన్న వాడికి ఏం కావాలో ఇంకా తెలియదు. ఎందుకంటే నేనేంటో ముందు నాకు తెలిస్తే కదా అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు మరొకరిని తెచ్చి చంకలో పెట్టుకోవడానికి వయస్సు అయిందని.. ఎవరో అడిగారని పెళ్లిళ్లు చేసుకోవద్దు అంటూ తెలిపారు. వివాహ వ్యవస్థలో లోపం లేదని.. దాని అర్థం చేసుకోవడంలోనే లోపాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>