Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakisthana62e41ba-1170-47f7-8a28-e9dfb6651627-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pakisthana62e41ba-1170-47f7-8a28-e9dfb6651627-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ పోరు ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారిపోయింది. సెమీఫైనల్కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమి ఫైనల్లో అడుగుపెట్టాయి అన్న విషయం తెలిసిందే అయితే ఇక నాలుగో స్థానంలో నిలిచి సెమి ఫైనల్ అడుగు పెట్టబోయే జట్టు ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల శ్రీలంకపై విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు.. సెమీఫైనల్కు మరింత చేరువైంది అని చెప్పాలి. ఏదో అద్భుతం జరిగితే తప్ప అటు న్యూజిలాండ్ కాకుండాPakisthan{#}Pakistan;Australia;England;New Zealandపాక్ సెమీస్ వెళ్లాలంటే.. అదొక్కటే మార్గం : పాక్ మాజీపాక్ సెమీస్ వెళ్లాలంటే.. అదొక్కటే మార్గం : పాక్ మాజీPakisthan{#}Pakistan;Australia;England;New ZealandFri, 10 Nov 2023 17:00:00 GMTవరల్డ్ కప్ పోరు ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారిపోయింది. సెమీఫైనల్కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో  ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమి ఫైనల్లో అడుగుపెట్టాయి అన్న విషయం తెలిసిందే  అయితే ఇక నాలుగో స్థానంలో నిలిచి సెమి ఫైనల్ అడుగు పెట్టబోయే జట్టు ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల శ్రీలంకపై విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు.. సెమీఫైనల్కు మరింత చేరువైంది అని చెప్పాలి.


 ఏదో అద్భుతం జరిగితే తప్ప అటు న్యూజిలాండ్ కాకుండా పాకిస్తాన్ సెమి ఫైనల్లో అడుగుపెడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్లో ఏకంగా 275 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంది. లేదంటే ఒకవేళ లక్ష్యాన్ని చేదించాల్సి వస్తే ఇంగ్లాండ్ తన ముందు ఉంచిన లక్ష్యాన్ని 2.3 ఓవర్లలోనే చేదించాలి. అలా అయితేనే ఇక న్యూజిలాండ్ ను వెనక్కినట్టు పాకిస్తాన్ ఇక నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. దీంతో ఇది జరిగే పని కాదు. దీంతో ఇక పాకిస్తాన్ కు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు గల్లంతు అయినట్లే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.


 ఇలాంటి సమయంలో టాప్ ఫోర్ లో ఉండి సెమీఫైనల్ అడుగుపెట్టేందుకు ఇప్పటికీ పాకిస్తాన్ జట్టుకు ఛాన్స్ ఉంది అంటూ ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పాకిస్తాన్ టాప్ ఫోర్ లో నిలవాలి అంటే   ఇక ఇంగ్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేయాలి. ఇంగ్లాండ్ ముందు భారీ స్కోరు ఉంచాలి అంటూ చెప్పాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టీం ఉన్న ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ కు తాళం వేయాలి. తద్వారా టైమ్డ్ ఔట్ కారణంగా.. అందరూ అవుట్ అయిపోతారు. దీంతో పాకిస్తాన్ గెలిచి సెమిస్కు వెళుతుంది అంటూ చమత్కరించాడు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ కు ఉన్న ఏకైక ఆప్షన్ కూడా ఇదొక్కటే అంటూ నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>