Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlib446e140-ea65-4404-9a68-36bce0931f94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlib446e140-ea65-4404-9a68-36bce0931f94-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అటు ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ అటు కోహ్లీ కి వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కడ రాలేదు. ఇతర దేశాలకు సంబంధించిన క్రికెట్ ప్రేక్షకులు సైతం తమ దేశ క్రికెటర్లను కాకుండా భారత ఆటగాడు అయిన విరాట్ కోహ్లీని అమితంగా అభిమానిస్తూ ఉంటారు. కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ఒకప్పుడు క్రికెట్లో హవా నడిపించి ఇక ఇప్పుడు లెజెండ్స్ గా కొనసాగుతున్న మాజీలు సైతం ఇక కోహ్లీ Kohli{#}West Indies;Cricket;VIRAT KOHLIకోహ్లీకి.. ఇతర ఆటగాళ్లకు తేడా అదే : విండీస్ దిగ్గజంకోహ్లీకి.. ఇతర ఆటగాళ్లకు తేడా అదే : విండీస్ దిగ్గజంKohli{#}West Indies;Cricket;VIRAT KOHLIFri, 10 Nov 2023 08:15:00 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అటు ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరల్డ్ క్రికెట్లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ అటు కోహ్లీ కి వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కడ రాలేదు. ఇతర దేశాలకు సంబంధించిన క్రికెట్ ప్రేక్షకులు సైతం తమ దేశ క్రికెటర్లను కాకుండా భారత ఆటగాడు అయిన విరాట్ కోహ్లీని అమితంగా అభిమానిస్తూ ఉంటారు. కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదండోయ్ ఒకప్పుడు క్రికెట్లో హవా నడిపించి ఇక ఇప్పుడు లెజెండ్స్ గా కొనసాగుతున్న మాజీలు సైతం ఇక కోహ్లీ ఆటను ఎంతగానో ఇష్టపడుతుంటారు అని చెప్పాలి.


 అంతలా తన ఆట తీరుతు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్కు రికార్డుల రారాజు అనే ఒక బిరుదును కూడా అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఎంతోమంది లెజెండ్స్ కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను విరాట్ కోహ్లీ అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే జట్టులోకి వచ్చి దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా కొత్తగా వచ్చిన ఆటగాడిలో ఉన్నంత కసి కోహ్లీలో ప్రతి మ్యాచ్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది.


 ఇలాంటి స్వభావమే కోహ్లీని అందరిలో కెల్లా ప్రత్యేకంగా నిలబెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోహ్లీ ప్రతిభ గురించి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతర ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ  మధ్య ఉన్న ప్రధాన తేడా అతడి మానసిక బలమే అంటూ చెప్పుకొచ్చాడు. ఒకానొక సమయంలో కష్టకాలంలోకి వెళ్ళిన విరాట్ కోహ్లీ ఇప్పుడు తిరిగి సత్తా చాటుతున్నాడు అంటూ హర్షం వ్యక్తం చేశాడు వివ్ రిచర్డ్స్. క్రికెట్ లో టాలెంట్ ఉన్నవాళ్లు ఎంతోమంది.. కానీ విరాట్  మించి మరొకరిని చూడలేము. నేను ఎంతో కాలంగా విరాట్ అభిమానిని మైదానంలో అతని తీవ్రత నాలాగే ఉంటుంది అంటూ వివ్ రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>