Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyodocb913973-7d94-4cd6-959e-9685022de503-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyodocb913973-7d94-4cd6-959e-9685022de503-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో స్టార్ నటులుగా హవా నడిపించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. సరికొత్త పాత్రలను తీసుకొచ్చింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈయన తొలినాళ్లల్లో పండంటి కాపురం సినిమా చేయగా.. ఇక ఈ మూవీ ప్రతి ఒక్కరి హృదయాలకు చేరువైంది. అయితే ఈ కథ బాగా నచ్చడంతో సొంతంగా డబ్బులు పెట్టి మరి ఈ మూవీని నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ. అయితే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో Tollwyodo{#}prabhakar reddy;Chatrapathi Shivaji;Sivaji;Film Industry;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;krishna;Rajani kanth;Telugu;Cinemaసూపర్ స్టార్ కృష్ణ ఆర్థిస్టులకు ఇంత గౌరవం ఇస్తారా.. ఓ రోజు ఏం జరిగిందంటే?సూపర్ స్టార్ కృష్ణ ఆర్థిస్టులకు ఇంత గౌరవం ఇస్తారా.. ఓ రోజు ఏం జరిగిందంటే?Tollwyodo{#}prabhakar reddy;Chatrapathi Shivaji;Sivaji;Film Industry;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;krishna;Rajani kanth;Telugu;CinemaFri, 10 Nov 2023 09:24:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో స్టార్ నటులుగా హవా నడిపించిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. సరికొత్త పాత్రలను తీసుకొచ్చింది కూడా సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈయన తొలినాళ్లల్లో పండంటి కాపురం సినిమా చేయగా.. ఇక ఈ మూవీ ప్రతి ఒక్కరి హృదయాలకు చేరువైంది. అయితే ఈ కథ బాగా నచ్చడంతో  సొంతంగా డబ్బులు పెట్టి మరి ఈ మూవీని నిర్మించారు సూపర్ స్టార్ కృష్ణ.


 అయితే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగిందట. అయితే ఈ విషయాన్ని సూపర్ స్టార్ మేకప్ మెన్ సి మాధవరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా కథలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. వారిలో పెద్ద ఎస్వి రంగారావు.  అయితే ఇందులో ఒక పాట చిత్రీకరణ కోసం శివాజీ గార్డెన్స్ లో సెట్ ఏర్పాటు చేశారట. వందల ఆర్టిస్టులు కూడా వచ్చారట. కానీ రంగారావు అక్కడికి రాలేదు. ఎందుకో బాగా తాగి ఇంట్లో ఉండిపోయారట. దీంతో ఆయనను తీసుకురావడానికి సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డిని పంపగా ఆయన వెళ్లి బతిమిలాడి రంగారావును షూటింగ్ స్పాట్ కి తీసుకొచ్చారట.


 షూటింగ్ స్పాట్ కి వచ్చాక కూడా ఏదో ఒక సాకులు చెబుతూ రంగారావు ఇక షూటింగ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారట.దీంతో సీనియర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి కోపంతో మాట తూలారట. ఏకంగా చంపేస్తాను అంటూ బెదిరించడంతో రంగారావుకు కోపం వచ్చి నన్ను చంపేస్తావా అంటూ ప్రభాకర్ రెడ్డి మీద అరిచారట.  తర్వాత ఇదే విషయంపై కృష్ణ వద్దకు వెళ్లారట గుమ్మడి. రంగారావు తప్ప మరో ఆర్టిస్టులేరా అని అడిగితే తాగుబోతు అనే కారణం ఒక్కరిని పక్కన పెట్టాం. మళ్ళీ ఇప్పుడు రంగారావుని కూడానా అని సమాధానం ఇచ్చారట  ఆ పాత్రకు రంగారావే న్యాయం చేయగలరని కృష్ణ చెప్పారట. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోటా పడి  రంగరావుకు చేరడంతో కృష్ణ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి అన్న కారణంతో సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు ఆయన మందు తాగను అని శబదం చేశారట. ఇలా ఏకంగా ఒక ఆర్టిస్టును సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిన ఆ పని చేయకుండా ఆర్టిస్టుకు గౌరవం ఇచ్చారు కృష్ణ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>