MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘నాయకుడు’ ఆరోజులలో ఒక సంచలనం. ఈ మూవీ అప్పట్లోనే ఆస్కార్ అవార్డుల రేస్ కు ఎంపిక అయింది. ఈమూవీ విడుదలై సుమారు 37 సంవత్సరాల తరువాత తిరిగి మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో సినిమా మొదలవ్వడం ఒక హాట్ టాపిక్. అయితే కమల్ పుట్టినరోజునాడు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కమలహాసన్ లుక్ చూసిన వారు అందరు షాక్ అయ్యారు. ఈ సినిమాకు ‘థ‌గ్ లైఫ్’ అనే క్రేజీ టైటిల్‌ పెట్టడం మరింత సంచలనంగా మారింది. ఈ ఫస్ట్ లుక్ టీజర్ ను చూసిన వారికి కమల్ మణిరత్నం నుండి ఒక kamalhassan{#}Oscar;Cinema;Mani Ratnam;Indian;Indiaకమలహాసన్ లేటెస్ట్ మూవీ చుట్టూ ధియరీలు !కమలహాసన్ లేటెస్ట్ మూవీ చుట్టూ ధియరీలు !kamalhassan{#}Oscar;Cinema;Mani Ratnam;Indian;IndiaThu, 09 Nov 2023 09:00:00 GMT
మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘నాయకుడు’ ఆరోజులలో ఒక సంచలనం. ఈ మూవీ అప్పట్లోనే ఆస్కార్ అవార్డుల రేస్ కు ఎంపిక అయింది. ఈమూవీ విడుదలై సుమారు 37 సంవత్సరాల తరువాత తిరిగి మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో సినిమా మొదలవ్వడం ఒక హాట్ టాపిక్. అయితే కమల్ పుట్టినరోజునాడు ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కమలహాసన్ లుక్ చూసిన వారు అందరు షాక్ అయ్యారు.



ఈ సినిమాకు ‘థ‌గ్ లైఫ్’ అనే క్రేజీ టైటిల్‌ పెట్టడం మరింత సంచలనంగా మారింది. ఈ ఫస్ట్ లుక్ టీజర్ ను చూసిన వారికి కమల్ మణిరత్నం నుండి ఒక భారీ యాక్షన్ మూవీ రాబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ టీజర్ లో కమల్ తన పాత్ర పేరు చెపుతూ శక్తివేల్ నాయకర్ అంటూ చెప్పడంతో ఈపాత్ర ‘నాయకుడు’ సినిమాలోని కమలహాసన్ మనవడి పాత్ర అన్న అర్థాలను తీస్తున్నారు.



మ‌రోవైపు థ‌గ్ లైఫ్ టీజ‌ర్‌ చూసిన వారు ఈ మూవీ కథకు 1961లో వ‌చ్చిన ‘యోజింబో’ అనే ఒక జ‌ప‌నీస్ సినిమాతో పోలిక‌లు క‌నిస్తుండ‌టంతో మణిరత్నం ఆ జపనీస్ సినిమా నుండి స్పూర్తి పొందాడ అన్న సందేహాలు మారికొందరికి వస్తున్నాయి. కొన్ని దశాబ్ధాలు తరువాత మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ సెట్ అవ్వడంతో పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న ఈ మూవీ కమల్ కెరియర్ లో 1000 కోట్ల సినిమాగా మారినా ఆశ్చర్యం లేదు.



సినిమా ఎప్పుడూ విడుదల అవుతుంది అన్న విషయం పై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఈమూవీలో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖ నటీ నటులు నటిస్తూ ఉండటంతో ఈమూవీ పై మరింత క్రేజ్ పెరుగుతోంది. 70 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పటికీ కమలహాసన్ తన సినిమాల ఎంపిక విషయంలో విభిన్నంగా వ్యహరిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>