MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna08fd6fa6-e2d5-4683-86e3-32fa0f7da288-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna08fd6fa6-e2d5-4683-86e3-32fa0f7da288-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో పవర్ ఫుల్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా వీర సింహా రెడ్డి లాంటి పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తర్వాత బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రిbalakrishna{#}Josh;lion;Simha;sithara;anil ravipudi;cinema theater;Mass;Makar Sakranti;Shruti Haasan;naga;surya sivakumar;Bobby;Posters;October;Balakrishna;Kesari;Cinemaఅఫిషియల్ : "ఎన్బికె 109" కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!అఫిషియల్ : "ఎన్బికె 109" కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!balakrishna{#}Josh;lion;Simha;sithara;anil ravipudi;cinema theater;Mass;Makar Sakranti;Shruti Haasan;naga;surya sivakumar;Bobby;Posters;October;Balakrishna;Kesari;CinemaThu, 09 Nov 2023 16:17:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో పవర్ ఫుల్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇలా వీర సింహా రెడ్డి లాంటి పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తర్వాత బాలకృష్ణ ... అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ తన తదుపరి మూవీ ని బాబి కొల్లి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ కేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమా షూటింగ్ ను తాజాగా ప్రారంభించామని తెలియజేసింది. ఇక ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ కావడం ... వాల్టేరు వీరయ్య లాంటి పవర్ఫుల్ విజయం తర్వాత బాబీ దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>