MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-actors-in-mani-ratnam-and-kamal-haasan-movief64b4404-9210-4aa9-9754-56a1e77040d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-actors-in-mani-ratnam-and-kamal-haasan-movief64b4404-9210-4aa9-9754-56a1e77040d3-415x250-IndiaHerald.jpgమణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'నాయకుడు' మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. మళ్లీ 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. #KH 234 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమలహాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్ర, శివ అనంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 7న కమల్ttollywood{#}Shiva;dulquer salmaan;lord siva;Oscar;Mani Ratnam;Evening;Industry;Trisha Krishnan;Heroine;Chennai;Salman Khan;raj;Hero;Success;November;Posters;Chitram;Cinemaమణిరత్నం, కమల్ హాసన్ సినిమాలో స్టార్ యాక్టర్స్..!!మణిరత్నం, కమల్ హాసన్ సినిమాలో స్టార్ యాక్టర్స్..!!ttollywood{#}Shiva;dulquer salmaan;lord siva;Oscar;Mani Ratnam;Evening;Industry;Trisha Krishnan;Heroine;Chennai;Salman Khan;raj;Hero;Success;November;Posters;Chitram;CinemaThu, 09 Nov 2023 14:47:00 GMTమణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'నాయకుడు' మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే. 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. మళ్లీ 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. #KH 234 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమలహాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్ర, శివ అనంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో ఒక్కరోజు ముందుగానే ఈ మూవీ నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించారు.

 తాజాగా మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో భాగమైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు దుల్కర్ కి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో దుల్కర్ పాత్ర కీలకంగా ఉండనున్నట్లు కలుస్తోంది. దుల్కర్ సల్మాన్ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ..' మణిరత్నం సర్, కమల్ సార్ సినిమాలో భాగం అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని' పేర్కొన్నాడు. దుల్కర్ సల్మాన్ తో పాటు చెన్నై  స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతుంది. తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టర్ ని సైతం రిలీజ్ చేస్తూ #KH 234 లో త్రిష భాగమైనట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. 

మరోవైపు కమలహాసన్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 5 గంటలకు టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు సర్ప్రైజ్ వీడియో సైతం విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. టైటిల్ అండ్ సర్ప్రైజ్ వీడియో కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హీట్ తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా కావడం, రీసెంట్ గా 'పొన్ని యన్ సెల్వన్' తో దర్శకుడిగా మణిరత్నం భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ ఇద్దరు దిగ్గజాలు సుమారు మూడు దశాబ్దాల తర్వాత కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>