Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2d715244-ec98-4703-bf05-35b3e7c7d9b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-2d715244-ec98-4703-bf05-35b3e7c7d9b7-415x250-IndiaHerald.jpgభారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా సమీపంలో ఉన్న మైదానాలలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా భారీగా స్టేడియం కు తరలి వెళ్లి మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడానికి ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే.. ఆ హడావిడి మరో లెవెల్ లో ఉంటుంది అని చెప్పాలి. అయితే హైదరాబాద్ వేదికగా డిసెంబర్ మూడవ తేదీన ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత పర్Cricket {#}Delhi;Cricket;Telangana;Australia;BCCI;local language;INTERNATIONAL;Telugu;December;Hyderabad;World Cup;India;Audience;Newsఅనుకున్నదే జరిగింది.. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి షాక్?అనుకున్నదే జరిగింది.. హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి షాక్?Cricket {#}Delhi;Cricket;Telangana;Australia;BCCI;local language;INTERNATIONAL;Telugu;December;Hyderabad;World Cup;India;Audience;NewsThu, 09 Nov 2023 21:00:00 GMTభారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా సమీపంలో ఉన్న మైదానాలలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా భారీగా స్టేడియం కు తరలి వెళ్లి మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడానికి ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు. అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇలా క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే.. ఆ హడావిడి మరో లెవెల్ లో ఉంటుంది అని చెప్పాలి. అయితే హైదరాబాద్ వేదికగా డిసెంబర్ మూడవ తేదీన ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే భారత పర్యటనలో ఉండబోయే ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి.


 ఇందులో భాగంగానే  డిసెంబర్ మూడవ తేదీన అటు హైదరాబాద్లో ఒక టి20 మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ టి20 మ్యాచ్ వేదికను మార్చె అవకాశం ఉందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి  ఇప్పుడు అనుకున్నదే జరిగింది. ఎందుకంటే హైదరాబాదులో నిర్వహించాల్సిన మ్యాచ్ను బెంగళూరుకు తరలిస్తున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు దృవీకరించారు  దీనికి కారణం డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉండటంతో భద్రత ఏర్పాట్లు చేయలేమని స్థానిక పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు తెలియజేశారు. దీంతో మ్యాచ్ ను నాలుగో తేదీకి వాయిదా వేయాలని హెచ్సీఏ కోరినప్పటికీ.. అందుకు బీసీసీఐ తిరస్కరించింది  ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు స్వదేశానికి చేరుకునేందుకు నాలుగో తేదీన ఢిల్లీ నుంచి ప్రయాణ ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయట  దీంతో ఇక మ్యాచ్ వేదికను మార్చడమే కరెక్ట్ అని బీసీసీఐ ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 ఇది హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా నిజంగా ఒక చేదు వార్త అని చెప్పాలి  ఎందుకంటే చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వేదికగా జరగబోయే ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నేరుగా చూడాలని ఎంతగానో ఆశపడ్డారు క్రికెట్ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు ఆ కోరిక నెరవేరేలా కనిపించడం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>