MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8aa89a42-4dda-417e-982c-7d0a2239fd35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8aa89a42-4dda-417e-982c-7d0a2239fd35-415x250-IndiaHerald.jpgనవంబర్ 1న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు అది కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం జరిగింది. ఇటలీలోని టుస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగాయి. వీరి పెళ్లికి మెగాస్టార్ దంపతులు, రాంచరణ్ ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు, నితిన్ ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. కాక టైల్ పార్టీతో మొదలై హాల్ది, సంగీత వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. tollywood{#}Sangeetha;nayantara;NET FLIX;Hyderabad;Hansika Motwani;kushi;October;Chiranjeevi;Tollywood;varun sandesh;varun tej;marriage;Allu Arjun;Kollywoodఓటీటీలో వరుణ్ - లావణ్య పెళ్లి వీడియో..!!ఓటీటీలో వరుణ్ - లావణ్య పెళ్లి వీడియో..!!tollywood{#}Sangeetha;nayantara;NET FLIX;Hyderabad;Hansika Motwani;kushi;October;Chiranjeevi;Tollywood;varun sandesh;varun tej;marriage;Allu Arjun;KollywoodThu, 09 Nov 2023 15:15:00 GMTవరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు అది కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం జరిగింది. ఇటలీలోని టుస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగాయి. వీరి పెళ్లికి మెగాస్టార్ దంపతులు, రాంచరణ్ ఉపాసన, అల్లు అర్జున్ దంపతులు, నితిన్ ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. కాక టైల్ పార్టీతో మొదలై హాల్ది, సంగీత వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. 

 పెళ్లి చేసుకుని తాజాగా హైదరాబాద్ కి తిరిగి వచ్చిన ఈ కొత్త కొత్త జంట గ్రాండ్ గా రిసెప్షన్ వేడుకలు నిర్వహించారు. ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  ప్రస్తుతం రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా అభిమానుల కోసం వరుణ్ తేజ్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే వరుణ్ - లావణ్య పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ఓటీటీలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ తేజ్ - లావణ్య కి సంబంధించిన పెళ్లి వీడియో ప్రసారం కానున్నట్లు సమాచారం. 

ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ సంబంధించిన వీడియోను అభిమానులు అందరూ చూసేలా ఓటిటిలో ప్రసారం చేయనున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వీరి పెళ్లి వీడియో ప్రసార హక్కులను దాదాపు రూ.8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గతంలో కోలీవుడ్ కపుల్స్ నయనతార - విగ్నేష్ శివన్, హన్సిక - సోహెల్ వంటి సెలబ్రిటీస్ తమ మ్యారేజ్ వేడుకలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లి వేడుక కూడా ఓటీటీ లో ప్రసారం కాబోతుందనే వార్త తెలిసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>