MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood243117be-4fca-4dd8-a0ff-65145a6ee777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood243117be-4fca-4dd8-a0ff-65145a6ee777-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో అయితే స్టార్ హీరోలు వందల కోట్ల రేమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. స్టార్ హీరోలే కాదు కొందరు అగ్ర దర్శకులు కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. ఓ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు అయితే అందులో హీరో రెమ్యూనరేషన్ కే రూ.100 కోట్లు పోతుంది. ఆ రేంజ్ tollywood{#}Allu Aravind;geetha;producer;Audience;Event;Press;Producer;Hero;Geetha Arts;Cinemaస్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!1స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!1tollywood{#}Allu Aravind;geetha;producer;Audience;Event;Press;Producer;Hero;Geetha Arts;CinemaThu, 09 Nov 2023 17:05:00 GMTసినిమా హిట్ అయితే చాలు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. స్టార్ హీరోలే కాదు కొందరు అగ్ర దర్శకులు కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. ఓ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లు అయితే అందులో హీరో రెమ్యూనరేషన్ కే రూ.100 కోట్లు పోతుంది. ఆ రేంజ్ లో స్టార్ హీరోలు పారితోషకాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇదే విషయంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'కోటబొమ్మాలి పిఎస్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అరవింద్ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్, సినిమా బడ్జెట్ లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 'కోటబొమ్మాలి పిఎస్' మూవీ టీజర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి..' కొంతకాలంగా గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు రావడం లేదు ఎందుకు? సినిమాల బడ్జెట్ పెరగడమే అందుకు కారణమా? ఆ లెక్కన చూసుకుంటే మీ ఫ్యామిలీ నుండి ఉన్న హీరోలు కూడా భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు కదా? అని అల్లు అరవింద్ ని ప్రశ్నించగా, దానికి అల్లు అరవింద్ బదులిస్తూ.." ప్రస్తుతం పెరిగిన సినిమా నిర్మాణ వ్యయంలో హీరోలు


 తీసుకున్నది 20 నుంచి 25 శాతం మాత్రమే. కాబట్టి హీరోల వల్ల సినిమాల కాస్ట్ పెరిగిపోతుంది అనడం కంటే నిర్మాణ వ్యయం పెరిగిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనడం కరెక్ట్. పేర్లు చెప్పడం బాగోదు. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాల్లో హీరోల రెమ్యూనరేషన్లు ఎంతున్నాయో మీరే లెక్క వేసుకోండి. చాలా మేరకు తక్కువగానే ఉన్నాయి. ఆడియన్స్ కూడా పెద్దగా చూపిస్తేనే పెద్ద సినిమాలను ఆదరిస్తారు. ఉదాహరణకి.. 'కేజిఎఫ్' ముందు యశ్ ఎంత పెద్ద హీరో? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆ రేంజ్ లో ఆడింది. మా గీత ఆర్ట్స్ నుంచి కూడా రెండు పెద్ద సినిమాలు రావాల్సి ఉండగా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతున్నాయి" అంటూ చెప్పుకొచ్చారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>