HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health62451bb0-b02e-4346-9545-a1ac76291b58-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health62451bb0-b02e-4346-9545-a1ac76291b58-415x250-IndiaHerald.jpgరాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక చాలా మంది అనారోగ్యాల భారిన పడుతూ ఉంటారు. కొందరికి పదే పదే నద్రలో మేలుకువ వచ్చినా సరిపడినంత నిద్ర అందదు. దాని ఫలితంగా శరీరం బాగా అలిసిపోయినట్లు, రోజంతా చాలా నీరసంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఖచ్చితంగా ఎన్నో రోగాలు చుట్టుముడతాయి. అందువల్ల వారు నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవడం చాలా అవసరం.డాక్టర్ల అభిప్రాయం ప్రకారం రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవడం చాలా అవసరం. ఈ అలవాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతHEALTH{#}Ginger;Turmericరాత్రిళ్ళు నిద్రపట్టాలంటే ఇవి తాగండి?రాత్రిళ్ళు నిద్రపట్టాలంటే ఇవి తాగండి?HEALTH{#}Ginger;TurmericThu, 09 Nov 2023 22:27:00 GMTరాత్రిళ్ళు సరిగా నిద్ర పట్టక చాలా మంది అనారోగ్యాల భారిన పడుతూ ఉంటారు. కొందరికి పదే పదే నద్రలో మేలుకువ వచ్చినా సరిపడినంత నిద్ర అందదు. దాని ఫలితంగా శరీరం బాగా అలిసిపోయినట్లు, రోజంతా చాలా నీరసంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఖచ్చితంగా ఎన్నో రోగాలు చుట్టుముడతాయి. అందువల్ల వారు నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవడం చాలా అవసరం.డాక్టర్ల అభిప్రాయం ప్రకారం రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవడం చాలా అవసరం. ఈ అలవాటు  మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అయితే మీకు రాత్రిళ్లు మంచి నిద్ర పట్టాలంటే ఖచ్చితంగా పడుకునే ముందు కొన్ని రకాల పానియాలు సేవించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పానియాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు శరీరంలోని అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పసుపు పాలు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. పైగా పసుపు కలిపిన పాలలో క్రిమినాశక యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి.


అందుకే రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగితే ఖచ్చితంగా మీకు నిద్ర బాగా పడుతుంది.అలాగే గ్రీన్ టీలో పరిమిత మొత్తంలో కెఫిన్ అనేది ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగించదు. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు చాలా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే నిద్రలేమి నుంచి బయటపడేందుకు పుదీనా టీని మీరు తాగవచ్చు.ఎందుకంటే ఈ టీ ఒత్తిడిని ఈజీగా తగ్గించి, నిద్రను ప్రేరేపిస్తుంది. ఇంకా అంతేకాకుండా, ఈ డ్రింక్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంకా నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇంకా అంతేకాకుండా అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇంకా అలాగే రాత్రి పడుకునే ముందు చమోమిలే టీ తాగవచ్చు. ఈ టీ నిద్ర సమస్యలను ఈజీగా దూరం చేస్తుంది. ఇంకా అలాగే, ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా ఈజీగా తగ్గిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>