EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ktr88f06592-d75e-47b7-a221-237645a2ad3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ktr88f06592-d75e-47b7-a221-237645a2ad3b-415x250-IndiaHerald.jpgఎన్నికల్లో వ్యూహ, ప్రతి వ్యూహాలే ఉంటాయి. అవే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వాటిని రూపొందించి అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట. అందుకే రాజకీయాల్లో కేసీఆర్ విజయవంతమయ్యారు. మాస్ పల్స్ ని పట్టుకొని వాళ్లను ఆకర్షించడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకుంటున్నాడు. తాజాగా గులాబీల తోటలో.. అనే పాటకు మంచి స్పందన వస్తోంది. ఏ బహిరంగ సభకు వెళ్లినా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఉద్యోగులు, విద్యావంతులతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు.KTR{#}KTR;Siva Kumar;TDP;KCR;YCP;Congress;Letter;Telangana Chief Minister;Hyderabad;Mass;Telanganaకేటీఆర్.. 'కర్ణాటక' మంత్రం ఫలిస్తుందా?కేటీఆర్.. 'కర్ణాటక' మంత్రం ఫలిస్తుందా?KTR{#}KTR;Siva Kumar;TDP;KCR;YCP;Congress;Letter;Telangana Chief Minister;Hyderabad;Mass;TelanganaThu, 09 Nov 2023 05:00:00 GMTఎన్నికల్లో వ్యూహ, ప్రతి వ్యూహాలే ఉంటాయి. అవే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. వాటిని రూపొందించి అమలు చేయడంలో కేసీఆర్ దిట్ట. అందుకే రాజకీయాల్లో కేసీఆర్ విజయవంతమయ్యారు. మాస్ పల్స్ ని పట్టుకొని వాళ్లను ఆకర్షించడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకుంటున్నాడు.


తాజాగా గులాబీల తోటలో.. అనే పాటకు మంచి స్పందన వస్తోంది. ఏ బహిరంగ సభకు వెళ్లినా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఉద్యోగులు, విద్యావంతులతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విపరీత ప్రచారం కల్పిస్తున్నారు. తద్వారా జనంలో ఈ పాటను ఉండేలా చేస్తున్నారు. మాస్ ప్లస్ క్లాస్ ను ఆకట్టుకునేలా కేటీఆర్ పన్నిన వ్యూహం ఇది.


మరోవైపు ఇప్పుడు కర్ణాటక సెంటిమెంట్ ను ప్రజల్లో రగల్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రా పాలకుల చేతికి తెలంగాణ వెళ్తోంది అనే అంశాన్ని తీసుకొని దాన్నే ప్రచార అస్త్రంగా మలచుకొని విజయం సాధించారు. ఈ దఫా ఆ సెంటిమెంట్ జోలికి పోవడం లేదు. ఎందుకంటే టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. వాళ్ల ఓటు బ్యాంకుతో పాటు వైసీపీ ఓట్లు కూడా రావాలి కాబట్టి దానిని ప్రస్తావించడం లేదు. కానీ ఈ సారి కర్ణాటక అంశాన్నిలేవనెత్తారు.


అదేంటంటే తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పెట్టుబడి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చే ఓ కంపెనీని మరిన్ని రాయితీలు కల్పిస్తాం బెంగళూరులో పెట్టండి అంటూ డీకే శివకుమార్ కోరినట్లు ఓ లేఖ  ప్రత్యక్షమైంది. దీనిని కేటీఆర్ ప్రచారాస్త్రంగా మలచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ కు వచ్చే అన్ని పెట్టుబడులను బెంగళూరు కు తరలిస్తారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. చూద్దాం దీని ప్రభావం ఈ ఎన్నికలపై ఏమైనా ఉంటుందా అని.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>