EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy8a7f1558-cc63-48a3-bca4-859bb622e01b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy8a7f1558-cc63-48a3-bca4-859bb622e01b-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు వైఎస్ షర్మిళ. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3600 కిలో మీటర్ల పాదయాత్ర కూడా చేపట్టారు. అనూహ్యంగా ఆమె తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు దిల్లీలో కలిశారు. ఏమైందో తెలియదు చివరకు విలీనం చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో పోటీ చేస్తామని ప్రకటించి.. ఆ తర్వాత ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్నామని.. వైఎస్సార్ టీపీ అభిమానులు కాంగ్రREVANTH REDDY{#}Revanth Reddy;Y. S. Rajasekhara Reddy;TPCC;Thief;Donga;Siva Kumar;revanth;Supreme Court;Congress;court;Telangana Chief Minister;CM;Reddy;Hyderabad;Telanganaరేవంత్‌ రెడ్డిపై షర్మిళకు అంత కోపం ఎందుకంటే?రేవంత్‌ రెడ్డిపై షర్మిళకు అంత కోపం ఎందుకంటే?REVANTH REDDY{#}Revanth Reddy;Y. S. Rajasekhara Reddy;TPCC;Thief;Donga;Siva Kumar;revanth;Supreme Court;Congress;court;Telangana Chief Minister;CM;Reddy;Hyderabad;TelanganaThu, 09 Nov 2023 00:00:00 GMTవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు వైఎస్ షర్మిళ. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3600 కిలో మీటర్ల పాదయాత్ర కూడా చేపట్టారు. అనూహ్యంగా ఆమె తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిపై కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు దిల్లీలో కలిశారు. ఏమైందో తెలియదు చివరకు విలీనం చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో పోటీ చేస్తామని ప్రకటించి..  ఆ తర్వాత ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు.


అనంతరం కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తున్నామని.. వైఎస్సార్ టీపీ అభిమానులు కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు.  ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆమె మాట్లాడుతూ.. మరోసారి సీఎం కేసీఆర్ సీఎం కాకూదనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు మద్దతిచ్చామని.. వారి నుంచి ప్రశంసలు ఆశించి కాదన్నారు.


ఇదే క్రమంలో రేవంర్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు సుప్రీం కోర్టు లో ఉందని.. కేసు కొట్టేయాలని ఆయన కోరితే కుదరదు విచారణ చేయాల్సిందేనని న్యాయస్థానం పేర్కొందని.. కాబట్టి దొంగ అని నేను అనడం లేదు.. అత్యున్నత ధర్మాసనమే చెప్పింది అని వ్యాఖ్యానించారు. ఆయన్ను కొంతమంది రేటెంత రెడ్డి అంటున్నారని..టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు. కాబట్టి తాను కాదు రేవంత్ రెడ్డిని వేరే వారు దొంగ అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి పార్టీలోను దొంగలు ఉంటారని.. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ అన్నారు.


వైటీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాక్షిగా షర్మిళ మంతనాలు సాగించారు. అయితే దీనికి రేవంత్ రెడ్డి అడ్డుతగిలారనే వాదన ఉంది. అందువల్లే ఆమె రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమెను ఏపీలో ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>