MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd27f3ee3-aafa-4d53-9dcc-ddb10c900acb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd27f3ee3-aafa-4d53-9dcc-ddb10c900acb-415x250-IndiaHerald.jpgకెరియర్లో అందరూ స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి . స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ చాలా కాలం పాటు వెలుగు వెలిగింది. రీసెంట్ గా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా అనుష్క తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అనుష్క తనకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ ఎలా tollywood{#}anoushka;Anushka;puri jagannadh;Smart phone;television;Interview;Wife;Success;Yoga;Nijam;Mister;Akkineni Nagarjuna;Industry;Heroine;Cinemaపూరి జగన్నాథ్ గారిని చీట్ చేశా..అనుష్క శెట్టి ..!!పూరి జగన్నాథ్ గారిని చీట్ చేశా..అనుష్క శెట్టి ..!!tollywood{#}anoushka;Anushka;puri jagannadh;Smart phone;television;Interview;Wife;Success;Yoga;Nijam;Mister;Akkineni Nagarjuna;Industry;Heroine;CinemaThu, 09 Nov 2023 18:15:00 GMTకెరియర్లో అందరూ స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ  అనుష్క శెట్టి . స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ చాలా కాలం పాటు వెలుగు వెలిగింది. రీసెంట్ గా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా అనుష్క తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో అనుష్క తనకు హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? పూరి జగన్నాథ్, నాగార్జున తనను ఎలా సపోర్ట్ చేశారు? అనే అంశాల గురించి మాట్లాడింది. 

 'యోగ టీచర్ గా ఆరు సంవత్సరాలు పనిచేశానని, యోగ మీద ఉన్న ప్యాషన్ తోనే పనిచేశాను తప్ప డబ్బు కోసం కాదని, నా జీవితంలో నేను ఎప్పుడూ డబ్బుకి ప్రయారిటీ ఇవ్వలేదని పేర్కొంది. మీకు హీరయిన్ గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అని అడగగా.." పూరి జగన్నాథ్ గారి వల్ల వచ్చింది. ఇండస్ట్రీ పర్సన్ అయిన నివాస్ గారి వైఫ్ నేను మంచి యోగా ఫ్రెండ్స్. నివాస్ గారితో పాటు శ్రీను అని ఉండేవారు. ఆయన పూరి జగన్నాథ్ గారిని కలవమని చెప్పారు. ఒక సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు అని చెప్పి ఫోన్ చేయమని నాతో అన్నారు. కానీ నాకు చాలా సిగ్గు. శీను గారు నాకు కాల్ చేయమని అన్నారు. కానీ నేను ఆ విషయంలో పూరి జగన్నాథ్ గారిని చీటింగ్ చేశాను. 

ఎందుకంటే నేను కాల్ చేయలేదు. ఆ సమయంలో శ్రీను గారు కాల్ చేసావా? అని అడిగితే చేశాను అని చెప్పాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ నేను తప్పించుకుంటున్నానని అర్థం చేసుకొని వాళ్లే నన్ను పూరి జగన్నాథ్ గారితో కల్పించారు. నిజం చెప్పాలంటే నేను సినిమాలు పెద్దగా చూడను. టీవీ కానీ మూవీస్ కానీ అలవాటు లేవు. అప్పుడు పూరి జగన్నాథ్ గారిని కలిశాను. సో ఒక మూవీ ఉందని చెప్పారు. అప్పుడు ఫోటో ఉందా? అని అడిగారు. దాంతో ఉందని, నా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చాను. అప్పుడు పూరి గారు ఆ ఫోటో చూసి ఆ తర్వాత నా ఫేస్ చూసి నవ్వారు. ఆ తర్వాత సరే నేను కాల్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోయారు అని చెప్పింది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>