EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc3a247a5-1568-446c-8749-6c29697cd453-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc3a247a5-1568-446c-8749-6c29697cd453-415x250-IndiaHerald.jpgవైఎస్ షర్మిళ.. ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఏపీలో అన్న సీఎం అయితే.. తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. దాదాపు తెలంగాణలో విలీనం చేసినంతం పని చేసి చివరకు పోటీ చేయడం లేదని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఏపీలోని జగన్ సర్కారుకు ఆమె తాజాగా గట్టి వార్నింగే ఇచ్చారు. పక్కా రాష్ట్రంతో పని ఏమన్నవారు.. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో అభివృద్ధి లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో తప్పుకున్న క్రమంjagan{#}Jagan;KCR;politics;YCP;SoniaGandhi;Congress;Party;CM;Telangana;Andhra Pradeshఇక షర్మిల.. జగన్‌కు దూరమైనట్టేనా?ఇక షర్మిల.. జగన్‌కు దూరమైనట్టేనా?jagan{#}Jagan;KCR;politics;YCP;SoniaGandhi;Congress;Party;CM;Telangana;Andhra PradeshWed, 08 Nov 2023 12:23:00 GMTవైఎస్ షర్మిళ.. ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఏపీలో అన్న సీఎం అయితే.. తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. దాదాపు తెలంగాణలో విలీనం చేసినంతం పని చేసి చివరకు పోటీ చేయడం లేదని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఏపీలోని జగన్ సర్కారుకు ఆమె తాజాగా గట్టి వార్నింగే ఇచ్చారు.


పక్కా రాష్ట్రంతో పని ఏమన్నవారు.. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో అభివృద్ధి లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో తప్పుకున్న క్రమంలో వైసీపీ నాయకులు ఆమెను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో ఆమె వారందరికీ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇదే క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై విరుచుకుపడ్డారు.  షర్మిళ కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటారు. ఆ పార్టీకి మద్దతు ఎలా ఇస్తారని వైసీపీ నేతలు ఆమెను ప్రశ్నిస్తున్నారు.


దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతివ్వడం ఆమె పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అని..కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ఇబ్బంది పెట్టిందన్న విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. నాడు సోనియా దగ్గరికి వెళ్లినప్పుడు వైఎస్ జగన్ తో పాటు షర్మిళ కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు.


దీనిపై షర్మిళ కౌంటర్ ఇస్తూ తెలంగాణ పార్టీతో సంబంధం లేదన్న సజ్జల.. ఇప్పుడు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారని అన్నారు. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో రోడ్లు, విద్యుత్తు పై సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం  చెబుతారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముందు మీ కథ మీరు చూసుకోండి అంటూ హితవు పలికారు. తాను తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికల్లో పాల్గొనలేదని.. ఎవరూ తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇది షర్మిళ, వైసీపీ మధ్య గొడవగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>