Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli5f41e46e-1038-40ad-b6be-75f0c398f3d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/k9hli5f41e46e-1038-40ad-b6be-75f0c398f3d7-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఈడెన్ గార్డెన్స్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో తన పుట్టినరోజు నాడు సెంచరీ సాధించి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మట్లో 49 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. దీంతో ఇక కోహ్లీ 35 పుట్టినరోజు అతనికి ఎంతో స్పెషల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో అటు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కానీ కK9hli{#}Hardik Pandya;Sachin Tendulkar;VIRAT KOHLI;Cricket;South Africaకోహ్లీ సెల్ఫిష్.. నెమ్మదిగా ఆడాడంటూ విమర్శలు.. కింగ్ ఏమన్నాడంటే?కోహ్లీ సెల్ఫిష్.. నెమ్మదిగా ఆడాడంటూ విమర్శలు.. కింగ్ ఏమన్నాడంటే?K9hli{#}Hardik Pandya;Sachin Tendulkar;VIRAT KOHLI;Cricket;South AfricaWed, 08 Nov 2023 20:30:00 GMTటీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఈడెన్ గార్డెన్స్ లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో తన పుట్టినరోజు నాడు సెంచరీ సాధించి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మట్లో 49 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు అని చెప్పాలి. దీంతో ఇక కోహ్లీ 35 పుట్టినరోజు అతనికి ఎంతో స్పెషల్ గా మారిపోయింది.


 విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో అటు అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. కానీ కొంతమంది మాత్రం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా సెంచరీ సాధించి వ్యక్తిగత రికార్డులు సాధించడం కోసం విరాట్ కోహ్లీ ఎంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఇలా జట్టు కోసం కాకుండా విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డుల మీదనే ఆసక్తి ఉంది అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే కొంతమంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ సెంచరీపై అతనికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఇదే విషయంపై విరాట్ కోహ్లీ స్వయంగా స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. రోహిత్,  గిల్ మంచి శుభారంభం ఇచ్చారు. తర్వాత క్రీజు లోకి వచ్చిన నేను అదే ఊపు కొనసాగించడంతోపాటు ఇన్నింగ్స్ ముందుకు తీసుకువెళ్లాలి. అయితే పదో ఓవర్ తర్వాత బంతి నుంచి టర్నింగ్ ఎక్కువగా ఉందనిపించింది. పిచ్ నెమ్మదించింది.  అందుకే సింగిల్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టాను. మిగతా బ్యాటర్లతో కలిసి పరుగులు రాబట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. అదే టీం మేనేజ్మెంట్ నుంచి నాకు వచ్చిన సందేశం. అయ్యర్ తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించడం ఆనందంగా ఉంది. ఆసియా కప్ నుంచి మేము మూడు నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నాం  ఎన్నోసార్లు పరుగుల గురించి మాట్లాడుకుంటున్నాం.  జట్టులో హార్దిక్ లేడు  మ్యాచ్ మా చేతిలోకి రావాలంటే మిడిల్ ఆర్డర్ లో రెండు వికెట్లు చాలా కీలకం  అందుకే చివరి వరకు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>