MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamalhasan-movies73e93c65-fd83-4eb3-befa-aa6c9c507d37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamalhasan-movies73e93c65-fd83-4eb3-befa-aa6c9c507d37-415x250-IndiaHerald.jpgవిశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్ అంటూ భాష తో సంబంధం లేకుండా ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటుడిగా పేరు తెచ్చుకొన్నారు. ఈయన ఒక నటుడు మాత్రమే కాదు రాజకీయ వేత్త కూడా.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ప్రజల కోసం సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి మరీ రాణిస్తున్నారు. ఇక ఈయన వారసురాలు శృతిహాసన్ కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే ఆమె ప్రభాష్ సలార్ మూవీ లో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. కమలహాసన్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్KAMALHASAN;MOVIES{#}Bharateeyudu;Kollywood;shankar;Shruti Haasan;Party;Tamil;Heroine;Mani Ratnam;Prabhas;India;Cinemaకమల్ హాసన్ అభిమానులకు శుభవార్త .. వరుస లైన్ అప్ ఇదే..!కమల్ హాసన్ అభిమానులకు శుభవార్త .. వరుస లైన్ అప్ ఇదే..!KAMALHASAN;MOVIES{#}Bharateeyudu;Kollywood;shankar;Shruti Haasan;Party;Tamil;Heroine;Mani Ratnam;Prabhas;India;CinemaWed, 08 Nov 2023 14:00:00 GMTవిశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్ అంటూ భాష తో సంబంధం లేకుండా ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటుడిగా పేరు తెచ్చుకొన్నారు. ఈయన ఒక నటుడు మాత్రమే కాదు రాజకీయ వేత్త కూడా.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు ప్రజల కోసం సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి మరీ రాణిస్తున్నారు. ఇక ఈయన వారసురాలు శృతిహాసన్ కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే ఆమె ప్రభాష్ సలార్ మూవీ లో కూడా హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

ఇదిలా ఉండగా.. కమలహాసన్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు -2 సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల కు సిద్దం కావడానికి షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఆయన భవిష్యత్ సినిమాల లైన్ అప్ చూస్తే మాత్రం ఆశ్యర్య పోక మానరు. అసలు విషయంలోకి వెళ్తే.. భారతీయుడు 2 సినిమాలో హీరోగా చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమా లలో గెస్ట్ రోల్ లో కూడా చేస్తున్నారు. అలా ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ k లో అతిథి పాత్ర పోషిస్తున్నారు.

తదుపరి భారతీయుడు 2 సీక్వెల్ భారతీయుడు 3 కూడా ఉండబోతోందని సమాచారం. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ మూవీ లో నటిస్తున్నారు.ఆ తర్వాత హెచ్ వినోద్ తో సినిమా వుంటుందని సమాచారం. ఇలా వరుస గా నాలుగైదు సినిమాలు ప్రకటించి అభిమానులకు శుభవార్త ప్రకటించారు కమల్ హాసన్. ఏది ఏమైనా కమల్ హాసన్ తదుపరి చిత్రాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో  సందేహం లేదు. మరి ఆ సినిమాలతో ఈయన ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>