MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-payal-rajf1a443ae-53d6-4acd-9f50-8e218423baa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-payal-rajf1a443ae-53d6-4acd-9f50-8e218423baa2-415x250-IndiaHerald.jpgమొదట తెలుగు ఇండస్ట్రీలోకి RX -100 సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్ .. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బోల్డ్ కథాంశంతో తెరకెక్కించడం తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమాని తెరకెక్కించారు. మొదట మంచి టాక్ వచ్చిన ఆ తర్వాత డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని డైరెక్టర్ అజయ్ భూపతి మళ్లీ పాయల్ తో కలిసి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో పాయల్ రాజ్ALLU ARJUN;PAYAL RAJ{#}Payal Rajput;nanditha;Chitram;Arjun;Father;tuesday;News;Allu Arjun;Heroine;Event;November;Telugu;Cinema;Directorపాయల్ కోసం.. అల్లు అర్జున్..!!పాయల్ కోసం.. అల్లు అర్జున్..!!ALLU ARJUN;PAYAL RAJ{#}Payal Rajput;nanditha;Chitram;Arjun;Father;tuesday;News;Allu Arjun;Heroine;Event;November;Telugu;Cinema;DirectorWed, 08 Nov 2023 07:30:00 GMTమొదట తెలుగు ఇండస్ట్రీలోకి RX -100 సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్ .. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బోల్డ్ కథాంశంతో తెరకెక్కించడం తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమాని తెరకెక్కించారు. మొదట మంచి టాక్ వచ్చిన ఆ తర్వాత డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని డైరెక్టర్ అజయ్ భూపతి మళ్లీ పాయల్ తో కలిసి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


ఇందులో పాయల్ రాజ్ పుత్ , నందిత శ్వేత ప్రధాన పాత్రలో కలిసి నటిస్తున్నారు నవంబర్ 17న ఈ సినిమా విడుదల కాబోతోంది ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సైతం చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 11న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయబోతున్నట్లు తెలుస్తోంది.



అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు ఎప్పుడూ కూడా తన తండ్రి లాగానే చిన్న సినిమాలను సైతం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొత్త నటీనటులకు కూడా సపోర్టుగా నిలవడం లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. ఇక అల్లు అర్జున్ గెస్ట్ అనగానే ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడుతోంది. మరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఏం మాట్లాడుతారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>