MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thug-life--kamal-haasan28d3aa38-66bb-4e87-8a44-9389469247a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thug-life--kamal-haasan28d3aa38-66bb-4e87-8a44-9389469247a9-415x250-IndiaHerald.jpgనేడు కమల్ హాసన్ పుట్టినరోజు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా చూశాక అందరూ మైండ్ బ్లోయింగ్ అంటూ పొగిడేశారు. విశ్వనటుడికి సరైన క్యారెక్టర్.. సరైన స్టోరి పడితే ఎలా చించి ఆరేస్తాడో 'విక్రమ్' సినిమా నిరూపించింది. విజయ్, అజిత్, సూర్య లాంటి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ హీరోల సినిమాల కమల్ హాసన్ విక్రమ్ ఏకంగా 400 కోట్ల పైగా భారీ వసూళ్లు కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో కమల్ పనైపోయింది అనుకున్న వాళ్లంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.ఆ సినిమా తరువాత విశ్వ నటుడుకి ఎదురే లేదు. ఆయన ఇప్పటికిప్పుడు వరుసగాThug Life - Kamal Haasan{#}surya sivakumar;vikram;Jayam;Kollywood;Chitram;vishwa;dulquer salmaan;India;Trisha Krishnan;Mani Ratnam;Cinemaథగ్ లైఫ్‌: నెట్టింటిని తగలబెడుతున్న కమల్ హాసన్?థగ్ లైఫ్‌: నెట్టింటిని తగలబెడుతున్న కమల్ హాసన్?Thug Life - Kamal Haasan{#}surya sivakumar;vikram;Jayam;Kollywood;Chitram;vishwa;dulquer salmaan;India;Trisha Krishnan;Mani Ratnam;CinemaTue, 07 Nov 2023 14:09:00 GMTనేడు కమల్ హాసన్ పుట్టినరోజు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా చూశాక అందరూ మైండ్ బ్లోయింగ్ అంటూ పొగిడేశారు. విశ్వనటుడికి సరైన క్యారెక్టర్.. సరైన స్టోరి పడితే ఎలా చించి ఆరేస్తాడో 'విక్రమ్' సినిమా నిరూపించింది. విజయ్, అజిత్, సూర్య లాంటి బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ హీరోల సినిమాల కమల్ హాసన్ విక్రమ్ ఏకంగా 400 కోట్ల పైగా భారీ వసూళ్లు కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో కమల్ పనైపోయింది అనుకున్న వాళ్లంతా కూడా ముక్కున వేలేసుకున్నారు.ఆ సినిమా తరువాత విశ్వ నటుడుకి ఎదురే లేదు. ఆయన ఇప్పటికిప్పుడు వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో హీట్ పుట్టించేస్తున్నాడు. కమల్ రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాలతో బాగా బిజీ అయిపోయాడు. ఇప్పుడు మరో సంచలనాత్మక కాంబినేషన్ తో దడ పుట్టిస్తున్నాడు కమల్ హాసన్. కమల్- మణిరత్నం ఏకంగా 36 సంవత్సరాల తర్వాత రెండవసారి కలిసి పని చేస్తున్నారన్న వార్త ఇటీవల సంచలనంగా మారింది. ఈ ఇరువురు దిగ్గజాల కలయికలో #KH234 చిత్రం గత నెలలో ప్రారంభమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జయం రవి, దుల్కర్ సల్మాన్ ఇంకా త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించనున్నారు.


కమల్ హాసన్ పుట్టినరోజుకు ఒక రోజు ముందు అనగా నిన్న నిర్మాతలు ఆయన పాత్రను  పరిచయం చేసిన తీరు ఎంతగానో అదరగొట్టింది.ఇక 'థగ్ లైఫ్‌' అనే టైటిల్ ఆద్యంతం క్యూరియాసిటీని పెంచింది. టైటిల్ కి తగ్గట్టే కమల్ ఒక ఘోరమైన థగ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎదురుగా మృత్యువే వస్తున్నా దానిని పడగొట్టడం ఎలానో తెలిసిన భీకరమైన థగ్ (గజదొంగ)గా ఆయన కనిపిస్తున్నాడు కమల్. ఆయన ఎవరికైనా ఎదురు నిలిచి దృఢంగా ఎదురెళతాడు. అయితే ఒక సమూహం ఆయనపై దాడికి దూసుకొస్తున్నా ఎవరినీ లెక్క చేయక తన పరాక్రమాన్ని చూపిస్తాడు. మణి రత్నం ఈ విజువల్ ని తెరకెక్కించిన వైనం మతి చెడగొట్టింది. ముఖ్యంగా 300- గ్లాడియేటర్ రేంజులో యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. సాంకేతికతలో భారతీయ సినిమా మరో ముందడుగు అని చెప్పేందుకు ఈ సినిమా మరో విజువల్స్ ప్రూఫ్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ గ్లింప్స్ ఇప్పుడు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>