PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/first-thing-chandrababu-did-when-he-entered-the-house7ac4711c-162c-4e3c-800c-023eb28b31e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/first-thing-chandrababu-did-when-he-entered-the-house7ac4711c-162c-4e3c-800c-023eb28b31e2-415x250-IndiaHerald.jpgకోర్టు షరతులను చంద్రబాబు పాటిస్తారని పెద్దిరెడ్డి ఎలా అనుకుంటారు. చంద్రబాబు రాజకీయాలే చేస్తారన్నవిషయం చిరకాల మిత్రుడు, ప్రత్యర్ధి పెద్దిరెడ్డికి తెలీదా ? రాజకీయమన్నది చంద్రబాబు నరనరాన జీర్ణించుకుపోయింది. జైలులో ఉన్నపుడే కుటుంబసభ్యులు, నేతలను పిలిపించుకుని రాజకీయాలు మాట్లాడిన చంద్రబాబు ఇంట్లో ఉన్నపుడు రాజకీయం చేయకుండా ఎలాగుంటారు. మెడికల్ బెయిలా, మధ్యంతర బెయిలా అన్నది ఇక్కడ అప్రస్తుతం. తాను బయటకు వచ్చానా లేదా అన్నదే చంద్రబాబుకు కావాల్సింది. chandrababu jail tdp {#}High court;YCP;TDP;Andhra Pradesh;CBN;court;Minister;politics;Congressఅమరావతి : చంద్రబాబును తక్కువ అంచనావేశారా ?అమరావతి : చంద్రబాబును తక్కువ అంచనావేశారా ?chandrababu jail tdp {#}High court;YCP;TDP;Andhra Pradesh;CBN;court;Minister;politics;CongressTue, 07 Nov 2023 03:00:00 GMT


మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబునాయుడును చాలా తక్కువ అంచనా వేసినట్లున్నారు. బెయిల్ పై చంద్రబాబు రిలీజైన దగ్గర నుండి రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. చంద్రబాబుకు మెడికల్ బెయిల్ ఇచ్చేముందే హైకోర్టు కొన్ని కండీషన్లు పెట్టి మరీ బెయిల్ పై విడుదలచేసింది. కోర్టు విధించిన షరతులను చంద్రబాబు పాటిస్తారని మంత్రులు, వైసీపీ నేతలు అనుకునుంటే అదిపొరబాటనే అనుకోవాలి. మెడికల్ బెయిల్ పై విడుదలైన దగ్గర నుండి చంద్రబాబు రాజకీయాలే చేస్తున్నారని, కోర్టు షరతులన్నింటినీ ఉల్లంఘిస్తున్నారని  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గోలచేయటమే విచిత్రంగా ఉంది.





కోర్టు షరతులను చంద్రబాబు పాటిస్తారని పెద్దిరెడ్డి ఎలా అనుకుంటారు. చంద్రబాబు రాజకీయాలే చేస్తారన్నవిషయం చిరకాల మిత్రుడు,  ప్రత్యర్ధి పెద్దిరెడ్డికి తెలీదా ? రాజకీయమన్నది చంద్రబాబు నరనరాన జీర్ణించుకుపోయింది. జైలులో ఉన్నపుడే కుటుంబసభ్యులు, నేతలను పిలిపించుకుని రాజకీయాలు మాట్లాడిన చంద్రబాబు ఇంట్లో ఉన్నపుడు రాజకీయం చేయకుండా ఎలాగుంటారు. మెడికల్ బెయిలా, మధ్యంతర బెయిలా అన్నది ఇక్కడ అప్రస్తుతం. తాను బయటకు వచ్చానా లేదా అన్నదే చంద్రబాబుకు  కావాల్సింది.





కంటి ఆపరేషన్ పేరుతో ఇంట్లో ఉన్న చంద్రబాబు తెలంగాణా రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నిస్తారనటంలో సందేహంలేదు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు సొంతపార్టీనే పోటీలో నుండి తప్పించేసిన  విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కాంగ్రెస్ లోని కీలక వ్యక్తులను ఫోన్లోనో లేదా తనింటికొ పిలిపించుకుని ఎన్నికల్లో చక్రంతిప్పటానికే ప్రయత్నిస్తారు. డైరెక్టుగా మాట్లాడటం, పిలిపించుకోవటం సాధ్యంకాకపోతే కామన్ ఫ్రెండ్స్ ద్వారా అనుకున్న పనికానిచ్చేందుకు ప్రయత్నిస్తారు.  సరిగ్గా నామినేషన్ల ముందు బెయిల్ పైన బయటకు వచ్చారు. ప్రచారం పూర్తయ్యేరోజుకు మళ్ళీ జైలుకు వెళతారు. నాలుగువారాల బెయిల్ యాధృచ్చికమేనా ?  ఈమధ్య సమయం సరిపోదా చంద్రబాబు చక్రంతిప్పటానికి.





పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు ఏమిటంటే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే  ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. అందుకోసమైనా చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఏపీ మంత్రులు ఊహించలేదా ? తాను చెప్పిందే చట్టం, చేసేదే న్యాయంగా ఇంతకాలం రాజకీయాలు చేసిన చంద్రబాబు  ఇపుడు కొత్తగా కోర్టు కండీషన్లు ఫాలో అవుతారని అనుకోవటం వేస్టు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>