MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aif11a4b52-2a74-4399-929b-5095624c259c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aif11a4b52-2a74-4399-929b-5095624c259c-415x250-IndiaHerald.jpgఇది సాంకేతిక యుగం.సాంకేతిక అభివృద్ధి కారణంగా అసాధ్యాలు కూడా ఇప్పుడు సుసాధ్యాలు అవుతున్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా ఊహించని పనులు ఎన్నో జరుగున్నాయి. అదే సమయంలో కత్తికి రెండు వైపుల పదును అన్నట్లుగా.. ఇదే టెక్నాలజీ కొన్ని తప్పుడు పనులు కూడా సులభంగా చేయిస్తుంది. కొంతమంది ఏఐ సహాయంతో నకీలీ ఫోటోలు ఇంకా వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరవును బజారున పడేస్తున్నారు.ఈ మార్ఫింగ్‌ టెక్నాలజీ సినీ హీరోయిన్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అసభ్యకరమైన వీడియోలకు.. స్టార్‌ హీరోయిన్ల ముఖాలను మార్AI{#}TECHNOLOGY;kavitha;rashmika mandanna;tamannaah bhatia;Dell;HP;Asus;Acer;Guntur;Cinema;Heroine;central government;Katrina Kaif;Minister;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Telangana;Prime MinisterTechnology: ప్రపంచాన్ని వణికిస్తున్న AI?Technology: ప్రపంచాన్ని వణికిస్తున్న AI?AI{#}TECHNOLOGY;kavitha;rashmika mandanna;tamannaah bhatia;Dell;HP;Asus;Acer;Guntur;Cinema;Heroine;central government;Katrina Kaif;Minister;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Telangana;Prime MinisterTue, 07 Nov 2023 18:05:00 GMTఇది సాంకేతిక యుగం.సాంకేతిక అభివృద్ధి కారణంగా అసాధ్యాలు కూడా ఇప్పుడు సుసాధ్యాలు అవుతున్నాయి.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా ఊహించని పనులు ఎన్నో జరుగున్నాయి. అదే సమయంలో కత్తికి రెండు వైపుల పదును అన్నట్లుగా.. ఇదే టెక్నాలజీ కొన్ని తప్పుడు పనులు కూడా సులభంగా చేయిస్తుంది. కొంతమంది ఏఐ సహాయంతో నకీలీ ఫోటోలు ఇంకా వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరవును బజారున పడేస్తున్నారు.ఈ మార్ఫింగ్‌ టెక్నాలజీ సినీ హీరోయిన్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అసభ్యకరమైన వీడియోలకు.. స్టార్‌ హీరోయిన్ల ముఖాలను మార్ఫింగ్‌ చేసి..వాటిని సోషల్‌ మీడియాలో తెగ సర్కులేట్‌ చేస్తున్నారు. తాజాగా రష్మిక మందన్నకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాను ఎంతగానో కుదిపేసింది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ఈ వీడియోపై చర్చించింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ఫేక్‌ వీడియో పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏది నకిలీదో ఏది ఒరిజినలో గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది. ఈ టెక్నాలజీని వాడుకొని గతంలో సమంత, సాయి పల్లవి, కాజల్‌ అగర్వాల్‌, కత్రినా కైఫ్‌ ఇంకా తమన్నా బాటియా లాంటి స్టార్‌ హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్‌ చేసి ఫేక్‌ వీడియోలు సృష్టించారు. 


సూపర్ మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమా పోస్టర్‌ని సైతం ఏఐ సహాయంతో సృష్టించి, సోషల్‌ మీడియలో సర్కులేట్‌ చేశారు. ఇంకా అంతే కాదండోయ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వాయిస్ ని కూడా వాడుకున్నారు. ఆయన వాయిస్ తో AI ద్వారా కొన్ని పాటలు సృష్టించారు. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అవి సరదాకి చేసినా భవిష్యత్తులో మాత్రం AI ద్వారా చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకంటే దుండగులు మోడీ వాయిస్ తో ఫ్యూచర్ లో అక్రమాలకు పాల్పాడవచ్చు. ఇప్పటికే ఒక రేంజ్ లో పలువురు హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్‌ చేసి అశ్లీల వీడియోలను రూపొందిస్తున్నారు.ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి స్టార్‌ హీరోయిన్ల నగ్న ఫోటోలను సృష్టించి, నెట్టింట్లో షేర్‌ చేస్తున్నారు. 


హీరోయిన్స్ సంగతి పక్కన పెడితే AI వల్ల సామాన్యులకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈ సమస్య రష్మికదో మరే హీరోయిన్ దో కాదు. అందరిది. దీని వల్ల అందరు ఇబ్బంది పడతారు.ఈ టెక్నాలజీని ఉపయోగించి దుండగులు సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకోవచ్చు..ఈ డిజిటల్‌ యుగంలో నకిలీ వీడియోలను ఇంకా ఫోటోలను కట్టడి చేయడం సవాలే అయినా..ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తే వాటిని కొంతవరకు అయినా తగ్గించే అవకాశం ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>