Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccf006e1ad-55a4-4ca3-9a81-f6ccb582b197-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccf006e1ad-55a4-4ca3-9a81-f6ccb582b197-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీలలో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఆశ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి ప్రతి మ్యాచ్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు ఎన్ని వైవిధ్యమైన బంతులు వేసిన బ్యాట్స్మెన్లు.. చూపించే దూకుడు ముందు అందరూ తేలిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా భారీగా పరుగులు సమర్పించుకొని.. చెత్త రికార్డులను మూటగట్టుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పాకిసIcc{#}Zimbabwe;Jason Holder;West Indies;Shaheen Bhatt;Dookudu;New Zealand;World Cup;Pakistanఒకే వరల్డ్ కప్ లో.. ఎక్కువ సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్లు వీళ్లే?ఒకే వరల్డ్ కప్ లో.. ఎక్కువ సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్లు వీళ్లే?Icc{#}Zimbabwe;Jason Holder;West Indies;Shaheen Bhatt;Dookudu;New Zealand;World Cup;PakistanSun, 05 Nov 2023 12:00:00 GMTసాధారణంగా ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నీలలో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలని ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఆశ పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇక బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడానికి ప్రతి మ్యాచ్లో కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు ఎన్ని వైవిధ్యమైన బంతులు వేసిన బ్యాట్స్మెన్లు.. చూపించే దూకుడు ముందు అందరూ తేలిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా భారీగా పరుగులు సమర్పించుకొని.. చెత్త రికార్డులను మూటగట్టుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ బౌలర్లు ఇటీవల న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా విఫలం అయిపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అరుదైన రికార్డుల కోసం కాదు చెత్త రికార్డుల కోసం పోటీ పడుతున్నారేమో అన్నట్లుగా బంతులు వేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్లో అటు పాకిస్తాన్ గెలిచినప్పటికీ అటు ఆ జట్టు బౌలర్లకు మాత్రం చెత్త రికార్డులు తప్పలేదు.


 ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్ లో ఒక మ్యాచ్లో ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్గా షాహిన్ చెత్త రికార్డు నమోదు చేస్తే ఆ జట్టు స్టార్ బౌలర్ హరీష్ రౌఫ్ మరో చెత్త రికార్డు మూట గట్టుకున్నాడు. వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. ఈ సీజన్లో హరీష్ రౌఫ్ ఏకంగా 16 సిక్సలు ఇచ్చుకున్నాడు. గతంలో జింబాబ్వే బౌలర్ పన్యంగర 15, భారత స్పిన్నర్ చాహల్ 14, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 14,  వెస్టిండీస్  ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ 13 సిక్సర్లతో ఒకే వరల్డ్ కప్ లో ఎక్కువ సిక్సర్లు  ఇచ్చిన బౌలర్లుగా ఉండగా.. ఇప్పుడు హరీష్ రౌఫ్ వీరందరినీ దాటి టాప్ లోకి వచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>