Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc2a70be2e-e55b-4e83-9c34-95ce73654dc2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc2a70be2e-e55b-4e83-9c34-95ce73654dc2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. టైటిల్ ఫేవరెట్ అనడం కంటే అంతకు మించిన అంచనాలతో ఇక వరల్డ్ కప్ ప్రస్తానాన్ని ప్రారంభించింది అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఇక టీమ్ ఇండియా పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలం నుంచి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది. దీంతో ఈసారి రోహిత్ సేన తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ గెలుస్తుందని అభిమానుIcc{#}vishwa;Hardik Pandya;BCCI;Army;K L Rahul;World Cup;Indiaహార్దిక్ దూరం.. టీమిండియా వైస్ కెప్టెన్ గా ఎవరంటే?హార్దిక్ దూరం.. టీమిండియా వైస్ కెప్టెన్ గా ఎవరంటే?Icc{#}vishwa;Hardik Pandya;BCCI;Army;K L Rahul;World Cup;IndiaSun, 05 Nov 2023 11:15:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. టైటిల్ ఫేవరెట్ అనడం కంటే అంతకు మించిన అంచనాలతో ఇక వరల్డ్ కప్ ప్రస్తానాన్ని ప్రారంభించింది అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో ఇక టీమ్ ఇండియా పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలం నుంచి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది. దీంతో ఈసారి రోహిత్ సేన తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ గెలుస్తుందని అభిమానులు భారీగాని ఆశలు పెట్టుకున్నారు.

 2011 వన్డే వరల్డ్ కప్ లో ఎలా అయితే విశ్వ విజేతగా నిలిచిందో.. ఇక ఇప్పుడు ఇదే రిపీట్ చేయబోతుంది అని అందరూ అనుకుంటున్నారు.. అయితే అందరి అంచనాలను నిలబెడుతూ టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే చిత్తుగా ఓడిస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్లలో కూడా విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండడమే కాదు సెమీఫైనల్ కి కూడా క్వాలిఫై అయింది. అలాంటి టీమిండియాకి ఇటీవల ఒక భారీ ఎదురు దెబ్బ తగిలింది.


 ఏకంగా జట్టులో కీలక ప్లేయర్గా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడిన అతను ఇప్పటికే మూడు మ్యాచ్లకు దూరం కాగా.. ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి అతను అందుబాటులో  ఉండడు అన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను బీసీసీఐ నియమించింది అని చెప్పాలి. అయితే తొలుత ఫాస్ట్ బౌలర్ బుమ్రాను రోహిత్ కు డిప్యూటీగా నియమించాలని బీసీసీఐ భావించింది  కానీ చివరికి అటు కేఎల్ రాహుల్ వైఫై ఓటు వేసింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>