EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu12bd716b-bc17-4914-9a77-c716f78a9c86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu12bd716b-bc17-4914-9a77-c716f78a9c86-415x250-IndiaHerald.jpgతెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు రిలీజ్ కు సంబంధించిన వివరాలు బయటపెట్టాల్సిన అవసరముంది. కేంద్రంలోని బీజేపీ నాయకులు అమిత్ షా, మోదీ లాంటి వాళ్లు బెయిల్ ఇప్పించారా? లేక కాంగ్రెస్ నాయకులు ఇప్పించారా? అంటే టీడీపీ తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి సపోర్టు చేస్తుందా.. లేక కాంగ్రెస్ కు సపోర్టు చేస్తుందా. మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకులు కోర్టులను శాసిస్తున్నారని కొంతమంది తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బాబు విడుదల వెనక బీజేపీ ఉందా లేక కాంగ్రెస్ ఉందా చెప్పాల్సిన అవసరం టీడీపీ నాయకులపై CHANDRABABU{#}TDP;Nara Bhuvaneshwari;Narendra Modi;central government;Amit Shah;Congress;Bharatiya Janata Party;Party;Nara Lokesh;CBNచంద్రబాబు రిలీజ్ వెనుక మోడీ ఉన్నారా?చంద్రబాబు రిలీజ్ వెనుక మోడీ ఉన్నారా?CHANDRABABU{#}TDP;Nara Bhuvaneshwari;Narendra Modi;central government;Amit Shah;Congress;Bharatiya Janata Party;Party;Nara Lokesh;CBNSun, 05 Nov 2023 23:00:00 GMTతెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు రిలీజ్ కు సంబంధించిన వివరాలు బయటపెట్టాల్సిన అవసరముంది. కేంద్రంలోని  బీజేపీ నాయకులు అమిత్ షా, మోదీ లాంటి వాళ్లు బెయిల్ ఇప్పించారా? లేక కాంగ్రెస్ నాయకులు ఇప్పించారా? అంటే టీడీపీ తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి సపోర్టు చేస్తుందా.. లేక కాంగ్రెస్ కు సపోర్టు చేస్తుందా.


మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకులు కోర్టులను శాసిస్తున్నారని కొంతమంది తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో బాబు విడుదల వెనక బీజేపీ ఉందా లేక కాంగ్రెస్ ఉందా చెప్పాల్సిన అవసరం టీడీపీ నాయకులపై ఉంది. కనిపించని శత్రువుతో నిరంతరం పోరాటం చేశామని చెప్పిన టీడీపీ నాయకులు బెయిల్ రావడంతో ఆ కనిపించిన శత్రువు పేరు చెబుతారో లేదో చూడాలి.


అయితే  నారా లోకేశ్ ఢిల్లీ లో ఉండి బీజేపీ అగ్రనాయకులను కలిసి చంద్రబాబు అరెస్టు అక్రమంగా జరిగిందనే వివరాలను వారితో పంచుకున్నారు. బాబు కు బెయిల్ ఇప్పించేందుకు దేశంలోనే అత్యుత్తమ లాయర్లను పెట్టి వాదనలు వినిపించారు. అయినా బాబు దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు నారా భువనేశ్వరి పార్టీకిి అన్నీ తానై నిలబడి పోరాటం చేసింది. ఇలా ప్రతి విషయంలో ఎంతో పరిణితి ప్రదర్శించింది.

ఒక వైపు లోకేశ్ బీజేపీ నాయకులతో మంతనాలు జరపడం, మరో వైపు రాష్ట్రంలో నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తలకు ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. ఇలాంటి తరుణంలో బెయిల్ రాకపోవడంతో టీడీపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై అగ్రశ్రేణి నాయకులపై విమర్శలు చేశారు. అయితే  తీర్పు ఇచ్చిన జడ్జి మాత్రం తన విచక్షణాధికారంతో ఆయన చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ అంతకుముందు టీడీపీ నాయకులు చేసిన విమర్శలు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాలన రాజకీయ విశ్లేషకులు వారికి సూచిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు విడుదలతో టీడీపీ నాయకులకు కొత్త ఎనర్జీ వచ్చినట్లయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>