Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc47092904-13f6-42b7-b686-493f6c7d3b6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc47092904-13f6-42b7-b686-493f6c7d3b6d-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు కేన్ విలియమ్సన్. కేవలం తన బ్యాటింగ్ తోనే కాదు తన కెప్టెన్సీ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఫైనల్ లో ఒక్క పరుగు తేడాతో అది కూడా ఐసీసీ రూల్స్ వల్ల ఆ జట్టు వరల్డ్ కప్ కోల్పోయిన సమయంలో అతను నవ్విన ఒక్క చిరునవ్వు మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఫిదా చేసేసింది. వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో కూడా ఎలా చిరునవ్వు చిందించగలుగుతున్నాడు. నిజంగా అతను ఎంతో ప్రత్యేకంIcc{#}Tom Banton;Tom Hooper;Fidaa;Parugu;Hanu Raghavapudi;New Zealand;World Cup;Cricket;Pakistan;India;Varshamకెన్ విలియమ్సన్ అరుదైన రికార్డు.. కివీస్ నుండి ఒకే ఒక్కడు?కెన్ విలియమ్సన్ అరుదైన రికార్డు.. కివీస్ నుండి ఒకే ఒక్కడు?Icc{#}Tom Banton;Tom Hooper;Fidaa;Parugu;Hanu Raghavapudi;New Zealand;World Cup;Cricket;Pakistan;India;VarshamSun, 05 Nov 2023 12:30:00 GMTప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు కేన్ విలియమ్సన్. కేవలం తన బ్యాటింగ్ తోనే కాదు తన కెప్టెన్సీ తో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఫైనల్ లో ఒక్క పరుగు తేడాతో అది కూడా ఐసీసీ రూల్స్ వల్ల ఆ జట్టు వరల్డ్ కప్ కోల్పోయిన సమయంలో అతను నవ్విన ఒక్క చిరునవ్వు మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఫిదా చేసేసింది.


 వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో కూడా ఎలా చిరునవ్వు చిందించగలుగుతున్నాడు. నిజంగా అతను ఎంతో ప్రత్యేకం అని అందరూ భావించడం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ప్రపంచ క్రికెట్లో  విలియంసన్ ఏం చేస్తున్నా కూడా అందరూ గమనించటం మొదలుపెట్టారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం భారత్ వేదికగా  జరుగుతున్న 2023 వరల్డ్ కప్ లో కూడా కెన్ విలియమ్సన్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగానే ఉన్నాడు.


 ఈ క్రమంలోనే అతనికి డిప్యూటీ అయిన టామ్ లాథం కెప్టెన్సీలో న్యూజిలాండ్ వరుస విజయాలు సాధించింది. అయితే ఇటీవల విలియంసన్ మళ్లీ కోలుకుని జట్టులో చేరాడు. ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో రావడం రావడమే 95 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి  ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ జట్టు తరఫున వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. 24 ఇన్నింగ్స్ లలో విలియమ్సన్ 1084 పరుగులు చేశాడు. ఇక తర్వాత స్థానంలో ఫ్లెమింగ్ 1075 రన్స్, టేలర్ 1002 పరుగులతో ఉన్నారు. కాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు భారీ పరుగులు చేసినప్పటికీ ఇక వర్షం కారణంగా పాకిస్తాన్ కి అదృష్టం కలిసి వచ్చి విజయం సాధించింది అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>