TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-nirupam3b9ffe6d-fdcd-42a6-8667-1fba05d31bd7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-nirupam3b9ffe6d-fdcd-42a6-8667-1fba05d31bd7-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ఒక రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న యాక్టర్లలో యాక్టర్ నిరూపమ్ పరిటాల కూడా ఒకరు.. కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిరూపమ్ డాక్టర్ బాబుగా మంచి క్రేజ్ అందుకున్నారు. 2008 నుంచి బుల్లితెర పైన వరుస పెట్టి పలు రకాల సీరియల్స్ లో నటిస్తున్న నిరూపమ్ వెండితెర పైన మాత్రం ఎందుకో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిరూపమ్ ఈ విషయం పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాక్టర్ నిరూపమ్ పరిటాల ఎవరో కాదు దివంగత నటACTER;NIRUPAM{#}vyjayanthi;Writer;paritala ravindra;Chandramukhi;television;Father;Research and Analysis Wing;Doctorటీవీ: బుల్లితెర డాక్టర్ బాబు హీరోగా కాకపోవడానికి కారణం అదేనట..!!టీవీ: బుల్లితెర డాక్టర్ బాబు హీరోగా కాకపోవడానికి కారణం అదేనట..!!ACTER;NIRUPAM{#}vyjayanthi;Writer;paritala ravindra;Chandramukhi;television;Father;Research and Analysis Wing;DoctorSat, 04 Nov 2023 02:00:00 GMTబుల్లితెరపై ఒక రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న యాక్టర్లలో యాక్టర్ నిరూపమ్ పరిటాల కూడా ఒకరు.. కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిరూపమ్ డాక్టర్ బాబుగా మంచి క్రేజ్ అందుకున్నారు. 2008 నుంచి బుల్లితెర పైన వరుస పెట్టి పలు రకాల సీరియల్స్ లో నటిస్తున్న నిరూపమ్ వెండితెర పైన మాత్రం ఎందుకో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిరూపమ్ ఈ విషయం పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


యాక్టర్ నిరూపమ్ పరిటాల ఎవరో కాదు దివంగత నటుడు రచయిత ఓంకార్ కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే తన గుర్తింపుతో బుల్లితెర పైన మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న ఈ నటుడు చంద్రముఖి సీరియల్ నుంచి యాక్టింగ్ చేసిన చివరికి కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీ అందుకున్నారు. తాజాగా రాధాకు నీవే రా ప్రాణం వంటి సీరియల్స్ లో మరింత గుర్తింపుని అందుకున్నారు. యాక్టర్ నిరూపమ్ కు ఎక్కువగా మహిళా ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ఇటీవలే వైజయంతి బ్యానర్ పైన కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నిత్యమీనన్ కి జోడిగా నటించడం జరిగింది.

ఈ వెబ్ సిరీస్ పరవాలేదు అనిపించకున్న నటనతో మరింత ఆకట్టుకునే విధంగా పాపులారిటీ సంపాదించుకున్నారు నిరూపమ్.. తాజాగా వెండితెర పైన ఎందుకు నటించలేదని ప్రశ్న ఎదురుగా అందుకు నిరూపమ్ మాట్లాడుతూ.. వరుస పెట్టి సీరియల్ చేస్తున్న సమయంలో రెండు మూడు సినిమాలలో ఆడిషన్స్ కి వెళ్ళాను ఆడిషన్స్ బాగానే ఉన్న టీవీ సీరియల్ చేస్తున్నాను అనే కారణంగా రిజెక్ట్ చేశారని తెలిపారు. ఆ సమయంలో చాలా ఏడుపు వచ్చిందని తన తండ్రి ఫోటో ముందు ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపారు నిరూపమ్. తనకు బ్యాగ్రౌండ్ సరిగ్గా లేకపోవడం వల్లే అవకాశాలు ఎక్కువగా రాలేదని ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. కానీ టెలివిజన్ రంగంలో తనకి చాలా సంతోషంగా పనిచేస్తున్నానని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>