PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-medigadda-kcre4827f13-4932-4185-9f65-4cf9c8a83ad2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-medigadda-kcre4827f13-4932-4185-9f65-4cf9c8a83ad2-415x250-IndiaHerald.jpgఇపుడున్న పరిస్ధితిల్లో బ్యారేజీని ఉపయోగించే అవకాశాలు ఎంతమాత్రం లేదని చెప్పింది. బ్యారేజి పునాదుల్లో ఇసుక కొట్టుకోవటం వల్లే కుంగిందని కమిటి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించింది. మొత్తం 20 అంశాలపై తాము వివరణ ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం 11 అంశాలకు మాత్రమే అరాకొరా సమాచారం ఇచ్చిందన్నారు. మిగిలిన అంశాలపై ఎన్నిసార్లు సమాచారాన్ని అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని కమిటి స్పష్టంగా చెప్పింది. telangana medigadda kcr{#}kaleshwaram;Kaleswaram Project;KCR;central government;Government;Newsహైదరాబాద్ : మేడిగడ్డ రిపోర్టుతో కేసీయార్ కు షాక్హైదరాబాద్ : మేడిగడ్డ రిపోర్టుతో కేసీయార్ కు షాక్telangana medigadda kcr{#}kaleshwaram;Kaleswaram Project;KCR;central government;Government;NewsSat, 04 Nov 2023 05:00:00 GMT


ఎన్నికల సమయంలో కేసీయార్ ప్రభుత్వం డొల్లతనాన్ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి (ఎన్ ఎస్ డీఏ) బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజి కుంగిన విషయం తెలిసిందే. బ్యారేజీ పిల్లర్లలో ఒకటి కుంగిన ఫలితంగా బ్యారేజీకి కూడా కుంగింది. నిజానికి ఇది చాలా ప్రమాధకరమైన పరిణామామనే చెప్పాలి. అయితే దీని తీవ్రత తెలిసిన కారణంగా కేసీయార్ ఈ ఘటనపై ఎక్కడా చర్చలు జరగకుండా, మీడియాలో వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.





అయితే కేంద్ర జలశక్తి తరపున మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన నిపుణుల బృందం రిపోర్టు అందించింది. అందులోను అంశాలు కేసీయార్ కు షాకింగా ఉన్నాయనే చెప్పాలి. డిజైన్, ప్లానింగ్, ఆపరేషన్ మెయిన్ టెన్స్ ఫెయిల్యూర్ వల్లే బ్యారేజి పిల్లర్ కుంగిపోయిందని దాని ఫలితంగానే బ్యారేజీ కూడా కుంగిందని కమిటి చెప్పింది. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా చెప్పింది. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజాజీవితంతో పాటు ఆర్ధికంగా కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందని కమిటి ఆందోళన వ్యక్తంచేసింది.





ఇపుడున్న పరిస్ధితిల్లో బ్యారేజీని ఉపయోగించే అవకాశాలు ఎంతమాత్రం లేదని చెప్పింది. బ్యారేజి పునాదుల్లో ఇసుక కొట్టుకోవటం వల్లే కుంగిందని కమిటి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించింది. మొత్తం 20 అంశాలపై తాము వివరణ ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం 11 అంశాలకు మాత్రమే అరాకొరా సమాచారం ఇచ్చిందన్నారు. మిగిలిన అంశాలపై ఎన్నిసార్లు సమాచారాన్ని అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని కమిటి స్పష్టంగా చెప్పింది.





మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలపైనా కమిటి ఆందోళన వ్యక్తంచేసింది. పై రెండు ప్రాజెక్టుల్లో కూడా మేడిగడ్డ తరహా సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు. సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టును తనిఖీచేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని హెచ్చరించింది. మొత్తానికి ఎన్నికల సమయంలో నిపుణుల కమిటి రిపోర్టు కేసీయార్  మడకు కుట్టుకోవటం తప్పదనే అనిపిస్తోంది. అందుకనే మేడిగడ్డ వైఫల్యంపై కేసీయార్, కేటీయార్, హరీష్ రావుతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు ఎక్కడా పొరబాటున కూడా మాట్లాడటంలేదు. మరి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.    




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>