PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vyuham-cinemapai-lokesh-firyadu-719f1360-9820-4dea-92e4-23e95c8576da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vyuham-cinemapai-lokesh-firyadu-719f1360-9820-4dea-92e4-23e95c8576da-415x250-IndiaHerald.jpgకాంట్రవర్సీకి ప్యాంట్, చొక్కా వేస్తే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లా ఉంటుందని చెప్పవచ్చు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ ట్వీట్లు, స్టేట్మెంట్ లు ఇస్తూ వార్తల్లో ఉంటారు. తనపై వచ్చే విమర్శలను సైతం తనదైన స్టైల్ లో కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలకు ప్రత్యేకించి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మౌత్ పబ్లిసిటీతో సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు. తాజాగా ఆయన వ్యూహం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులను వివరిస్తూ వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్షపార్టీలనుlokesh{#}Ram Gopal Varma;Nara Lokesh;Hanu Raghavapudi;Letter;NTR;Jagan;Father;Chitram;Director;Cinema;TDP;YCPరామ్‌గోపాల్‌వర్మపై నారా లోకేశ్‌ "వ్యూహం"?రామ్‌గోపాల్‌వర్మపై నారా లోకేశ్‌ "వ్యూహం"?lokesh{#}Ram Gopal Varma;Nara Lokesh;Hanu Raghavapudi;Letter;NTR;Jagan;Father;Chitram;Director;Cinema;TDP;YCPSat, 04 Nov 2023 09:05:11 GMTకాంట్రవర్సీకి ప్యాంట్, చొక్కా వేస్తే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లా ఉంటుందని చెప్పవచ్చు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ లు ఇస్తూ వార్తల్లో ఉంటారు. తనపై వచ్చే విమర్శలను సైతం తనదైన  స్టైల్ లో కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. ఆయన తీసిన సినిమాలకు ప్రత్యేకించి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మౌత్ పబ్లిసిటీతో సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు.  తాజాగా ఆయన వ్యూహం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


ఏపీలో రాజకీయ పరిస్థితులను వివరిస్తూ వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్షపార్టీలను తక్కువ చేసి చూపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 2014 ఎన్నికల్లో జగన్ పరాజయం పొందిన దగ్గర నుంచి 2019 లో విజయం సాధించడం.. ఆ తర్వాత నెలకొన్న పరిణామాల ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబరు 10 న విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు వర్మ.  


అయితే ఆయనకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.  సినిమాలో నిజ జీవితంలో ఉన్న పేర్లను వాడారని కమిటీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఈ సినిమాకు అనుమతి ఇవ్వొద్దంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. తన తండ్రి చంద్రబాబు తో పాటు తనను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు.

 
అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి విడుదల కూడా చేశారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది దీనిని ఏదోలా రిలీజ్ చేస్తారు.  రామ్ గోపాల్ వర్మ మాత్రం దీనిపై మరోసారి తన దైన శైలిలో స్పందిచారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు.. ఎన్ని వ్యూహాలు పన్నినా మా వ్యూహాన్ని ఆపలేరు అంటూ పోస్ట్ పెట్టారు.  మరోవైపు ఈ అంశంపై రివైజింగ్ కమిటీకి వెళ్తామని అక్కడా అభ్యంతరం చెబితే కోర్టుకు వెళ్తామని ఆయన తెలిపారు. చూద్దాం ఇది విడుదల అవుతుందో లేదో..?



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>