Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc31ee89d0-5577-40d8-a9ad-d29493a2dbd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc31ee89d0-5577-40d8-a9ad-d29493a2dbd9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్ని ఎన్నో అద్భుతాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ భారీ రేంజ్ లోనే ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి. ఏకంగా పటిష్టమైన టీమ్స్ ని సైతం ఓడిస్తున్నాయి. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో పూర్తిస్థాయి మెంబర్షిప్ లేని టీమ్స్ సైతం ఏకంగా చాంపియన్ టీమ్స్ ను ఓడిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో సIcc{#}Cricket;India;Pakistan;Netherlands;history;World Cup;Qualificationచరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. తొలిసారి అలా?చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. తొలిసారి అలా?Icc{#}Cricket;India;Pakistan;Netherlands;history;World Cup;QualificationSat, 04 Nov 2023 10:30:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్ని ఎన్నో అద్భుతాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ భారీ రేంజ్ లోనే ప్రదర్శనలు చేస్తూ ఉన్నాయి. ఏకంగా పటిష్టమైన టీమ్స్ ని సైతం ఓడిస్తున్నాయి. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో పూర్తిస్థాయి మెంబర్షిప్ లేని టీమ్స్ సైతం ఏకంగా చాంపియన్ టీమ్స్ ను ఓడిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి.


 అయితే ఇలా ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఆఫ్గానిస్తాన్ జట్టు. బౌలింగ్ విభాగం లో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న ఈ జట్టు.. ఇక ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతం ప్రదర్శన కనబరుస్తుంది. తమను చిన్న టీం అని తక్కువ అంచనా వేసుకున్న.. ప్రతి ఒక్కరికి కూడా తగిన బుద్ధి చెబుతూ వరుస విజయాలతో దూసుకుపోతుంది అని చెప్పాలి. ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ జోరు చూస్తే అటు సెమీఫైనల్ లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించేలాగే కనిపిస్తుంది. ఇటీవల  నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా భారీ తేడాతో విజయం సాధించింది ఆఫ్ఘనిస్తాన్.


 దీంతో పాకిస్తాన్ వెనక్కి నెట్టి ప్రస్తుతం పాయింట్లు పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తూ సెమీఫైనల్ రైస్ లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్  మరో ఘనత సాధించింది. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయింది. 2025 లో జరగబోతున్న టోర్నీలో పాల్గొననుంది. ఇప్పటివరకు భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. ఇక ఈ వరల్డ్ కప్ లో పాయింట్ల ఆధారంగా మాత్రమే మరో రెండు టీమ్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధించే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>