Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik3225150b-0b51-45b3-bddb-67210000cf1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik3225150b-0b51-45b3-bddb-67210000cf1c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి టీమ్స్ అన్నింటిని కూడా చిత్తుగా ఓడిస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకే ఒక్క భారత జట్టు మాత్రమే. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడితే ఏడింటిలో కూడా విజయం సాధించింది. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో అడుగు పెట్టిన మొదటి టీం గా కూడా రికార్డు క్రియేట్ చేసింది భHardik{#}Cricket;Hardik Pandya;BCCI;World Cup;Mohammed Shami;Bangladesh;Indiaవన్డే వరల్డ్ కప్ లో.. టీమిండియాకు బిగ్ షాక్?వన్డే వరల్డ్ కప్ లో.. టీమిండియాకు బిగ్ షాక్?Hardik{#}Cricket;Hardik Pandya;BCCI;World Cup;Mohammed Shami;Bangladesh;IndiaSat, 04 Nov 2023 09:22:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి టీమ్స్ అన్నింటిని కూడా చిత్తుగా ఓడిస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకే ఒక్క భారత జట్టు మాత్రమే. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడితే ఏడింటిలో కూడా విజయం సాధించింది. అంతేకాదు ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో అడుగు పెట్టిన మొదటి టీం గా కూడా రికార్డు  క్రియేట్ చేసింది భారత జట్టు.


 ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు ఇటీవల ఒక భారీ ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో చీలమండ గాయం కావడంతో అతను నొప్పితో విలువలాడిపోయాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అయితే అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. గత మూడు మ్యాచ్ల నుంచి కూడా అతను జట్టుకు అందుబాటులో ఉండడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతను సెమీఫైనల్ సమయానికి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉందని అందరూ ఊహించారు.


 కానీ ప్రస్తుతం భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడి హార్దిక్ ఇప్పటికే మూడు మ్యాచ్లకు దూరం అవ్వగా గాయం తీవ్రత పెరగడంతో మొత్తానికి దూరమైనట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అయితే హార్థిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధి కృష్ణను జట్టులోకి తీసుకుంటున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అయితే హార్దిక్ ఇక జట్టుకు దూరం అవడంతో సూర్యకుమార్ తో సహా అటు మహమ్మద్ షమీ కూడా జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఇద్దరు కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>