EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu4bf0d40e-552f-4fea-803c-71ab14d56bca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababu4bf0d40e-552f-4fea-803c-71ab14d56bca-415x250-IndiaHerald.jpgమనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రెండు చోట్లకి ఎప్పుడూ వెళ్లకూడదని పెద్దలు అంటుంటారు. అందులో ఒకటి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి.. రెండోది పరిస్థితులు బాగోలేక జైలుకి. ఈ రెండు చోట్లకి వెళ్లినవారిలో విపరీతమైన మార్పులు వస్తాయనేది వారి వాదన. తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కి మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చారు. అయితే చంద్రబాబు జన్మభూమి, శ్రమదానం, ఆకస్మిక తనిఖీలు అంటూ ఎప్పుడూ జనం మధ్యనే ఉండేవారు. అధికారంలో ఉన్నchandrababu{#}CBN;High court;Rajahmundry;Varsham;TDPజైలు జీవితం బాబులో తెచ్చిన మార్పులివే?జైలు జీవితం బాబులో తెచ్చిన మార్పులివే?chandrababu{#}CBN;High court;Rajahmundry;Varsham;TDPFri, 03 Nov 2023 08:28:00 GMTమనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రెండు చోట్లకి ఎప్పుడూ వెళ్లకూడదని పెద్దలు అంటుంటారు. అందులో ఒకటి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి.. రెండోది పరిస్థితులు బాగోలేక జైలుకి. ఈ రెండు చోట్లకి వెళ్లినవారిలో విపరీతమైన మార్పులు వస్తాయనేది వారి వాదన. తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కి మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చారు.


అయితే చంద్రబాబు జన్మభూమి, శ్రమదానం, ఆకస్మిక తనిఖీలు అంటూ ఎప్పుడూ జనం మధ్యనే ఉండేవారు. అధికారంలో ఉన్నా.. ప్రతి పక్షంలో ఉన్నా తిరిగే కాలు.. తిట్టే నోరు  ఎప్పుడు ఊరుకోదని ఆయన ప్రజా క్షేత్రంలోనే ఉండేవారు. అలా జనంలో ఉన్నప్పుడు కనిపించే జోష్, ఉత్సాహం, ఆయన మోహంలో కనిపించలేదు. కారణం జైలు జీవితం. దాదాపుగా 52 రోజులు ఆయన జైలులో ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై బయటకి వచ్చిన సందర్భంలో ఆయన్ను చూసిన అభిమానులు చంద్రబాబు మారిపోయారని మాట్లాడుకున్నారు.  


ఈ వయసులో జైలు జీవితం అనుభవించడం ఆయన్ను డిఫ్రెషన్ లోకి నెట్టేసి ఉండవచ్చు.  మరొకటి ఇంట్లో ఉండే సౌకర్యాలు జైలులో ఉండవు. ఇంటి దగ్గర అడుగడుగునా సేవకులు, ఏసీ తదితర సౌకర్యాలన్నీ ఉంటాయి. జైలులో ఇవేమీ ఉండవు. సాధారణ జీవితం గడపాలి. దీనివల్ల ఆయన ఫేస్ కొంచెం మారిపోయి ఉండవచ్చు. చంద్రబాబుని అలా చూసిన ఆయన అభిమానులు తట్టుకోలేకపోయారు.


దారి పొడవునా టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతరులు సైతం ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. గ్రామాల్లో ఉండేవారు సైతం రోడ్లపైకి వచ్చారు. ఫేస్ చిన్నది కావడంతో పాటు ఏదో తెలియని బాధ ఆయన మనసులో ఉన్నట్లు కనిపిస్తోంది.  దాదాపు 50 రోజుల పాటు చంద్రబాబుని చూడని ఆయన అభిమానులు దారి పొడవునా నీరాజనం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ.. దిష్టి తీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>