Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/team-indiaecbc52de-5bbc-49a9-aedf-f01966c94e5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/team-indiaecbc52de-5bbc-49a9-aedf-f01966c94e5d-415x250-IndiaHerald.jpgసొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇక 2023 వరల్డ్ కప్ సీజన్లో క్వాలిఫైయర్ లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు మ్యాచ్లలో 6 విజయాలు సాధించిన టీమిండియా ఇటీవలే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఏడవ విజయాన్ని సాధించడం ద్వారాసెమీఫైనల్ కు క్వాలిఫై అయింది. ఏకంగా ఈ మ్యాచ్లో 32 పరుగులు తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో క్వాలిఫైTeam india{#}MS Dhoni;Australia;Qualification;Dookudu;World Cupసెమీఫైనల్ చేయడంలో కూడా.. టీమిండియా ప్రపంచ రికార్డు?సెమీఫైనల్ చేయడంలో కూడా.. టీమిండియా ప్రపంచ రికార్డు?Team india{#}MS Dhoni;Australia;Qualification;Dookudu;World CupFri, 03 Nov 2023 10:30:00 GMTసొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇక 2023 వరల్డ్ కప్ సీజన్లో క్వాలిఫైయర్ లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు మ్యాచ్లలో 6 విజయాలు సాధించిన టీమిండియా ఇటీవలే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఏడవ విజయాన్ని సాధించడం ద్వారాసెమీఫైనల్ కు క్వాలిఫై అయింది. ఏకంగా ఈ మ్యాచ్లో 32 పరుగులు తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మ్యాచ్ లో క్వాలిఫై అవడమే కాదు అటు పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానానికి దూసుకువెల్లింది టీం ఇండియా. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ సెమి ఫైనల్ కు క్వాలిఫై అవ్వడం విషయంలో కూడా ఒక అరుదైన రికార్డును సృష్టించింది. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటివరకు టీం ఇండియాకు ఇలా సెమి ఫైనల్ కు క్వాలిఫై అవ్వడం ఇది ఎనిమిదో సారి. తద్వారా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు అత్యధిక సార్లు అర్హత సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్తో సంయుక్తంగా నిలిచింది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు 8 సార్లు వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ లో అడుగుపెట్టాయి.



 ఇప్పటివరకు ఎనిమిది సార్లు సెమీఫైనల్ లో అడుగుపెట్టిన భారత జట్టు రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మొదటిసారి ప్రపంచకప్ టోర్నీ గెలిచి భారత సత్తా ఏంటో ప్రపంచ క్రికెట్కు చాటి చెప్పిన టీమిండియా.. ఇక 2011లో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను నెక్కి విశ్వవిజేతగా నిలిచింది. 2003లో వరల్డ్ కప్ ఫైనల్ కు చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. అయితే ఇక ఇప్పుడు ఎంతో దూకుడు చూపిస్తున్న టీమిండియా.. ఎట్టి పరిస్థితుల్లో అటు వరల్డ్ కప్ లో టైటిల్ విజేతగా నిలుస్తుందని భారత అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>