Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccec28288e-fa76-4c0f-a3df-b78a0bed2ea0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccec28288e-fa76-4c0f-a3df-b78a0bed2ea0-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. సొంతగడ్డ మీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టుకు తిరుగే లేకుండా పోయింది. అటు ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో టీమిండియాని ఎదుర్కొని ఓడించే జట్టు ఎక్కడ కనిపించడం లేదు. అన్ని టీమ్స్ కూడా టీమిండియాతో మ్యాచ్ ఆడుతూ వరుస ఓటములతో సతమతమవుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా కూడా టీమిండియా అరుదైన రికార్డును సృష్టిIcc{#}BCCI;Pakistan;India;Cricket;World Cupవరుస విజయాలు.. టీమిండియాపై పాక్ మాజీ సంచలన ఆరోపణలు?వరుస విజయాలు.. టీమిండియాపై పాక్ మాజీ సంచలన ఆరోపణలు?Icc{#}BCCI;Pakistan;India;Cricket;World CupFri, 03 Nov 2023 09:00:00 GMTవరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలు సాధిస్తూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. సొంతగడ్డ మీద జరుగుతున్న వరల్డ్ కప్ కావడంతో భారత జట్టుకు తిరుగే లేకుండా పోయింది. అటు ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో టీమిండియాని ఎదుర్కొని ఓడించే జట్టు ఎక్కడ కనిపించడం లేదు. అన్ని టీమ్స్ కూడా టీమిండియాతో మ్యాచ్ ఆడుతూ వరుస ఓటములతో సతమతమవుతున్నాయి.


 అంతేకాదు ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా కూడా టీమిండియా అరుదైన రికార్డును సృష్టించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 302 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ ఘనతను అందుకుంది అని చెప్పాలి. అయితే ఇలా భారత జట్టు ఒక్క ఓటమి కూడా లేకుండా వరుస విజయాలు చూస్తూ ముందుకు సాగుతూ ఉండడం మాత్రం కొంతమందికి నచ్చడం లేదు. ఇలా నచ్చని వారిలో కొంతమంది పాకిస్తాన్ మాజీలు ఉన్నారు అని చెప్పాలి. దీంతో టీం ఇండియా విజయాలపై సంచలన ఆరోపణలు చేయడానికి కూడా రెడీ అయ్యారు.


 ఇలా భారత్ వరుస విషయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉండటం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హాసన్ రజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మిగతా టీమ్స్ బౌలర్ల కంటే టీమ్ ఇండియా బౌలర్లకు చాలా స్వింగ్ లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, బిసిసిఐ భారత బౌలర్లకు ప్రత్యేక బాల్స్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అందుకే భారత బౌలర్లు బ్యాటింగ్ పిచ్ పై కూడా బాగా రాణిస్తున్నారు. ఇక డిఆర్ఎస్ కూడా వారికి అనుకూలంగానే వస్తుంది. ఇక ఈ విషయంపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ హాసన్ రజా సంచలన కామెంట్లు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>