HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc22b1d74-dbdf-4902-8ac3-64110eedb106-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsc22b1d74-dbdf-4902-8ac3-64110eedb106-415x250-IndiaHerald.jpgడ్రై ఫ్రూట్స్ తో చేసే లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇక వీటిని రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఇంకా రక్తహీనత తగ్గుతుంది. శరీరం చాలా బలంగా ధృడంగా తయారవుతుంది. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల వారికి చాలా మేలు కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇక ఈ లడ్డూలను తయారు చేయడం కHealth Tips{#}Pistachio;Jaggery;Gas Stove;Pregnant;Ghee;Manamఈ లడ్డులు తింటే ఎముకలు గట్టి పడతాయి?ఈ లడ్డులు తింటే ఎముకలు గట్టి పడతాయి?Health Tips{#}Pistachio;Jaggery;Gas Stove;Pregnant;Ghee;ManamFri, 03 Nov 2023 16:13:00 GMTడ్రై ఫ్రూట్స్ తో చేసే లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచివి. పైగా ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇక వీటిని రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. ఇంకా రక్తహీనత తగ్గుతుంది. శరీరం చాలా బలంగా ధృడంగా తయారవుతుంది. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల వారికి చాలా మేలు కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇక ఈ లడ్డూలను తయారు చేయడం కూడా చాలా సులభం. వీటిని ఎవరైనా చాలా తేలికగా  తయారు చేసుకోవచ్చు. ఇక రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ముందుగా మీరు కళాయిలో నెయ్యి వేసి దానిని వేడి చేయాలి. ఆ నెయ్యి వేడయ్యాక బాదంపప్పు, జీడిపప్పు ఇంకా పిస్తా వేసి వేయించాలి.ఆ తరువాత ఎండు కొబ్బరి తురుము వేసి వేయించాలి. ఇది కొద్దిగా వేగిన తరువాత గసగసాలు కూడా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత అదే కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి లేత తీగపాకం రాగానే మంటను మీరు చిన్నగా చేసుకోవాలి. ఆ తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడగానే స్టవ్ ని ఆఫ్ చేసి దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇంకా ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ వాటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే హెల్తీ లడ్డూలు తయారవుతాయి. పైగా ఇవి 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ విధంగా రుచిగా ఇంకా ఆరోగ్యానికి మేలు చేసేలా డ్రై ఫ్రూట్స్ తో రుచికరమైన లడ్డూలను తయారు చేసి తీసుకోవచ్చు.వీటిని తింటే ఖచ్చితంగా చాలా బలంగా తయారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వీటిని తినండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>